Pages

Wednesday, September 13, 2017

              కళ్ళల్లో మెదిలే   కృష్ణమణికి 
                             కన్నీటి   తర్పణం 
                        గద్వాలులో మఠం   వారింట పుట్టిన  మణి కృష్ణ మణి. ఆంద్గ్రా గరల్స్ ఉన్నత పాఠ శాలలో చదివిన బాలిక. 12 వ తరగతి పాసై ,లైబ్రరీ కోర్సు పూర్తి చేసి అదే పాఠశాలలో  లైబ్రరీ యన్గా 18 సంవత్సరాలకే చేరిన లలన .  ఆకులో ఆకునై  పూవులో పూవునై అని దేవులపల్లి వారన్నట్లు పుస్తకాలలో పుస్తకమై మెలిగిన ముగ్ధ . కోపమెరుగని కోమలి .రామ కోటి పూర్తి చేసి రామ పట్టాభి షేకం జరిపించుకొన్న రామదాసి .అలుపెరుగని అతివ. ఇన్ని సద్గుణాలను కలబోసుకొన్న కొమ్మ 
మా కృష్ణ మణి 
                                    లైబ్రరీ లో పనిచేసేటప్పుడు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే  ,వాళ్ళ కిచ్చ్చిన సబ్జెక్ట్ కు  సంబంధించిన పుస్తకాలు చూసి ఇఛ్చి వారికి సాయపడేది. 
                           లైబ్రేరియన్ గా వున్నపుడే తనకి వివాహమయి ఉప్పరిపల్లి వారి కోడ లయింది  అప్పుడే బి .ఏ పూర్తి చేసింది 
తరువాత నైట్ కాలేజీలో చదివి ఎమ్ ఏ చేసింది. పాఠశాలకు 
శెలవు పెట్టి బి.ఎడ్ చేసింది జానకితను చేశారు .అదే బడిలో 
ఉపాధ్యాయురాలిగా చేరింది. మా బడిలో అక్కడే చదివి అక్కడే 
ఉద్యోగం చేసినవాళ్లు ఎంతోమంది. సత్యవతి  టీచరుగారు మా 
కందరికి ప్రేరణ .ఆమె సారధ్యం లోనే స్ఫూర్తి అనే విద్యానిధి 
మొదలుపెట్టి  కృష్ణమణి ,జానకి పైకితెచ్చారు. బీదవిద్యార్థులకి 
ఫీజులు కట్టి చదివిస్తారు. కృష్ణమణి చాలా ఒడుపుగా విరాళాలు సేకరించేది. 
అది ఇంతింతై వటుడింతయై అన్నట్లు పెరిగింది. ఇప్పటికి మా 
విద్యార్థినులు విశేష మైన కృషి చేస్తున్నారు. తనను ఎరిగిన ఒకరు "డబ్బున్న బీచ్చ్చగత్తెగా "అభివర్ణించారు. శ్రీనివాసా ఎడ్యుకేషనల్ సొసైటీలో మెంబరుగా పనిచేసి పిల్లలకి ఫీజులు కట్టించేది. 
                    మా పాఠశాలలో UN అసెంబ్లీ జరిగేది దానికి కృష్ణ మణి ప్రత్యక్షంగానూ,జానకి పరోక్షంగానూ రధ సారధిలు    ఇన్ని టిని అలవోకగా నిర్వహించిన సమర్ధురాలు అంట అలవోకగాను 
అందని దూర తీరాలకు తరలి పోయింది . మా మిత్ర మండలికి 
జానకి పవిత్ర  రోమన్ సామ్రాజ్యం అని పేరు పెట్టింది. 
                       జానకి  కూడా అక్కడే చదివి పరీక్షలు పాసై అక్కడే ఉద్యోగం చేసింది . జానకి  కృష్ణ మణి ,శ్రీదేవి ముగ్గురూ సోషల్ చెప్పేవారు ఎప్పుడూ ఎదో చర్చిస్తూ ఉండేవారు. జానకి అంటుంది కృష్ణ మణి నాకు స్నేహితురాలు ,హితైషిని ,సోదరీ భావం   అని ,ఏమండీ మీకు బుధ్దిలేదు " అనే చనువు ఉండేది. 
మంచి సలహాలు చెప్పేది. నాకుం ఉద్వేగం ఎక్కువ తాను నన్ను సంబాళించి చల్ల బరిచేది. రామకోటి వ్రాయడానికి తానే ప్రేరణ ఇచ్చింది. కాది వ్రాస్తున్నపుడల్లా గుర్తువస్తుంది. కృష్ణమణి మంచి వంటకాలు చేసి తెచ్చ్చేది. తన కూరలు తాను తినే ప్రాప్తం వుండేదికాదు ఎందుకంటే మాకూరలు తన డబ్బాలో పెట్టి తనవి మేము తినేసే వాళ్ళం . కృష్ణ మణి అనగానే బిసిబేలబాత్  జ్ఞాపకం వస్తుంది . అనురాగ వతి యైన గృహిణి స్నేహశీలి ,కోమలమైన మనస్తత్వం . "ఏమోనబ్బా నాకైతే తెలియకనేపాయే "అనేది. 
                     తన సాహచర్యం లో గడిపిన మేము తనకేమివ్వగలం? తనగురించి మీకు తెలియ చేయడం తప్ప. 
అశ్రు నివాళులతో 
మిత్ర మండలి 

No comments: