Pages

Tuesday, May 15, 2018

ఎవరు వచ్చ్చారు ?

ఎవరు వచ్చ్చారు ?
ఎవరు వాచ్చ్చారమ్మ
ఎవరు వచ్చ్చారు ?
సామగానమ్ములా
సవ్వడి   తోచె      ఎవరు

కోకిలమ్మా వచ్చ్చి
కుర్చీలో   కూర్చుంది
నావలెనె   తీయగా
ఆలపించారెవరు ? ఎవరు ?

గలగలా   సెలయేరు
గడపలోకొచ్చింది
నావలెనె కలకలా
నింపె నాదమ్మెవరు ?  ఎవరు

మేఘమ్ము   దిగివచ్చి
ముంగిట్లొఉరిమింది
నావలెనె ఫె ళ ఫెళా
గర్జించి  రెవ రహో .    ఎవరు

పిల్లగాలి వఛ్చి
ఇల్లంత తిరిగింది
నావలెనె హాయిగా
పాడినా రెవరో     ఎవరు

                      ఆమె
మాఇంటికొచ్చింది
ఒకవీణ తీగ
మాఇంటికొచ్చింది
ఒక వేణు   స్వనము

మాఇంటికొచ్చింది
లయతో. మృదంగం

మాఇంటికొచ్చింది
ఒక వాణి   అంశ

No comments: