Pages

Wednesday, January 31, 2007

స్వీయ కధనం

నేను ఆంద్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో నూజివీడు లో మా తాతగారింటిలో (
అమ్మ నాన్నగారు )పుట్టాను .ఎప్పుడంటారా ,1937 లో .మాతాతగారు ఉయ్యూరు కుమారరాజాగారి హైస్కూల్ లో ఇంగ్లీష్ మాస్టరు , శ్రీగిరిరాజు రామచంద్రయ్యగారు . మా నాన్నగారు రావూరు వెంకట సత్యనారాయణ రావుగారు .నేపుట్టిన తరువాతే


నాన్నగారు "కృష్ణా పత్రిక లో చేరారు . నాబాల్యం ౧౨ ఏళ్లు బందరులోనే గడిచింది .ఆరోజుల్లో ఆడపిల్ల బయటికి వెళ్లి చదవటమంటీ అభ్యంతరం గానే వుండేది . ఇల్లు పుస్తకాలే నా ప్రపంచం . మావారు .టి .ఆర్ .రావు గారు . సుదర్సన్, ప్రవీణ్ , మురళి , వేదు మా అబ్బాయిలు .మావారు 5 ఏళ్ళ క్రితం చనిపోయారు . ప్రస్తుతం నేను మాపిల్లల్ని చూడటానికి అమెరికా వచ్చాను . ఇక్కడ చాలా విశ్రాంతిగా కూర్చోవటం వలన , ఏదైనా చేయాలని కుతూహలం పెరిగింది . మాపెద్ద కోడలు కంప్యూటర్ కి సంబంధించిన ఉద్యోగం లో వుండటం నాకూ లాభాకారి అయింది . చాలా సతాయించి కం .లో ఈ .మెయిల్ పంపటం నేర్చుకోన్నాను . జీవితంలోని పడమటి సంధ్యలో కూర్చుని , క్షణాలు చేతిలోంచి జారిపోతూంటే ఏదో ఒకటి చేయాలనే తపన నన్నీ పనికి పురికొల్పింది . దీనివలన మీ భావాలు నాభావాలు ప్రకటించుకొనే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాను .
టి.జ్ఞాన ప్రసూన

1 comment:

Phani said...

This lady is really greattt.....Generally people who are at their respective children's house abroad,jus pass their time time.But this lady has learn how to operate INTERNET and even opened a WEBSITE...
avidaki naa HATSOFF...
carry on gnana garu!!