Pages

Thursday, February 1, 2007

చిరు జల్లులు

 . నేయి  అన్నం  మీద   వేసాకనే తినాలి , ఎందుకంటే  మనలోవుండేపరబ్రహ్మ    మనము తినే  భోజనం లో మొదటి ముద్దఆరగిస్తాడు.  నేయి అభికరించాకుండా   నివేదన  చేయ కూడదు .మనలో వుండే జ ట్హ రాగ్ని  లో  కొంచెం నేయి  వేస్తె  అది  మరింత  ప్రజ్వరిల్లి  అన్నం  బాగా  తింటామని పెద్దవాళ్ళుఅనేవారు.నేయి ఈ రోజుల్లో   పచారీ  పద్దు లోంచి ఎప్పుడో పరారీ అయింది. రోజు నెయ్యి వేసుకొని తినలేనివారు,అతిథులు వచ్చినా,పండుగలు,పబ్బాలు వచ్చినా నెయ్యి తెచ్చి వాడుకొనే  వారు. మా నాన్నగారి "వడగళ్ళ హీరో"మల్లినాథ సూరి గారి  ఇంటికి ఒకసారి చుట్టం వచ్చాడట,ఆయన భార్య చుట్టలోచ్చారు,కాస్త అయినా  నెయ్యి పట్టుకు రండి అని బతిమాలిందట. మల్లినాథు ఒక పావుకిలో నెయ్యి తీసుకు వెళ్లారట.అతిథికి అన్నం వడ్డించి మల్లినాధు ఆవ లుగారు భార్య నెయ్యి వేసింది. అప్పుడు ఆమనిషి చేతివేళ్ళునాలుగూ అన్నం మీద విడి విడిగా కృష్ణా బ్రిడ్జి మీద చేక్కలలా పెట్టాడట.  ఇంకేముంది?పావికిలో నెయ్యి ఆయన  ఒక్కరికే సరిపోయిందట. మల్లినాతులు గారిభార్య లోపలి వెళ్లి నూనె తెచ్చి మల్లినాధు లకు వడ్డి న్చిందిట . తెలుగులో ఒక సామెత వుంది,"అల్లుడికి నెయ్యిలేదు అతనితో వచ్చిన వానికి నూనేలేదు"అని. అంటే ఇంట్లో పరిస్థితి అంత  దారుణం గా ఉందన్నమాట. పూర్వం చిన్న పిల్లలు రోజూ ఉదయం చద్ది అన్నం తిని బడికి వెళ్ళేవారు..ఇల్లాలు మడికట్టుకొని  వూరి బయట  వున్ననూతిలోంచి మంచి నీళ్ళు తెచ్చి వంట చెయ్యాలి. అంట దాకా పిల్లలు ఆకలికి  ఆగలేరని గొడవ చెయ్యకుండా చద్ది అన్నం పెట్టేవారు ఏదో ఒక ఊరగాయ వేసి,ఇంట నెయ్యివేసి కలిపి అన్నం పెదితెపెరుగు వేసుకు తిని కడుపులో చల్ల కదలకుండా అన్నట్లు వాళ్ళు హాయిగా   ఆడుకొనే వాళ్ళు..నాచిన్నతనంలో ఒకసారి మా శ్రీ లక్ష్మి పిన్ని ఇంకి వెళ్లాను.పొద్దున్నే చల్ల చేస్తూ, ఆచల్లకోట్టులోనే  మాకు అన్నం పెట్టేది  నిమ్మ కాయంత గోంగూర పచ్చడి వేసి నిమ్మకాయంత పేరిన నెయ్యి విసిరేది కంచంలోకి.{కంచం అంటే ఇప్పటి వాళ్లకు తెలియదు.అదేమిటి?అంటారు}కంచం అంటే ప్లేట్ p.చల్ల చేసి వూరుబయట  కి వెళ్లి మంచినీళ్ళు తెచ్చేదాకా మేము చద్దిఅన్నం కెక్కు కెక్కు మంటూ తినలేక దిక్కులు చూస్తుండే వాళ్ళం.నెయ్యి పదార్ధానికి సగం రుచి కల్పిస్తుంది.ఇప్పుదేమితో ఎదిగే పసి పిల్లలకి కూడా నెయ్యి వెయ్యడంలేదు.పైగా బరువులు తూస్తున్నారు.వేడీ వేడి అన్నంలోఆవకాయ వేసుకొని నెయ్యి కలుపుకు తింటే ఏమిరుచి?ఎంత రుచి?సురుచి!మా పెద్ద మనమడు ఇండియా వస్తే దోసె మీద వేసుకోడానికి ఇంట్లో చేసిన వెన్న ఇచ్చాను,  వాడు దాన్ని కొత్త వస్తువులా వింతగా చూసి వాట్ ఈస్ థిస్ ?అన్నాడు.వేన్నారా!అన్నాను."ఇవాంట్ ఎల్లో బటర్ "అన్నాడు..ఆ మరునాడు వాడు చూడకుండా కాస్త పసుపు వెన్నలో కలిపి ఇస్తే తిన్నాడు. ఇప్పుడేమి టంటే  నూనేకూడా  వాడ కూడదట !నాన్ స్టిక్ పేనాలు వచ్చాయి.దానిమీద దోసె వేస్తె నూనె తక్కువ పడుతుంది,పైగా  దానికి అంట దుట  ,ఈ మాటే కల్పకం తో అంటే తల అడ్డంగా తిప్పి"ఏడిసి నట్లే వుంది.మనం తినేదే ఇంత  అందులో నూనె కూడా లేకుండా దోసేలా?ఆపెనాలు కొనకు"అం  ది. యంత్రాలు పెరిగి పోయాక ఆడవారికి,మగవారికి కావలసినంత వ్యాయామం లేదు.ఫీట్ నెస్ మీద ధ్యాస పెరిగింది.      పూర్వ ఏవి తింటే బలమనుకొనే వాళ్ళమో ఇప్పుడవి అంతహానికరం అంటున్నారు. ఊరగాయలు,పప్పు పచ్చళ్ళు,వేయించిన కూరలు, హానికరం అంటున్నారు.బొబ్బట్లు,అరిసెలు,మినపసున్ని ఉండల  మాట చెప్పక్కర్లేదు.కొన్నాళ్ళు పొతే  ఈ  పిండి వంటలన్నీ మ్యూజియం లో పెట్టి చూపిస్తారేమో!


No comments: