కథ
అందమైన శరదృతువు ,రాత్రుళ్ళు చల్ల ని పిల్ల వాయువులు వీస్తున్నాయి ,పొగడచెట్టు పూలు జలజలా రాలుతున్నాయి .ఆ పొగడ చెట్టు కిందే పెద్దరాతి శిల వుంది . చాలా
పొగడపూలు ఆ రాతిమీదే రాల్తాయి . రాతి శిలకి చాలా చిరాకు కోపం వస్తుంది . అది పొగడ చెట్టు తో చాలా సార్లు హెచ్చరిక చేసింది , నువ్వు నీపూలన్ని నా మీద రాల్చకు ,బాగుండదు అని .
ఇంత చెప్పినా రోజూ ఇలా జరుగుతూనే వుంది .రాతి శిలకి కోపం రెచ్చి పోయింది . నామాట లక్ష్యం చేయకుండా ఈ చెట్టు పూలన్నీ నామీద రాలుస్తూనే వుంది , ప్రతీకారం తీసుకోవాల్సిందే అనుకొంది తనలో తాను . మరునాటి నుంచీ పొగడ పువ్వు తనపై వ్రాలటం ఆలస్యం నలిపి వేయడం మొదలెట్టింది . చిన్నచిన్న పూలు రాలేవి , వాటిని కూడాశిల నలిపి పారేసేది . అయినా చెట్టు నుంచి పూలు రాలడం ఆగలేదు .
రాతి శిల ,"నేనిలా పూలు నలిపి పారేస్తూంటే బుద్ది తెచ్చుకొని నన్ను క్షమార్పణ అడిగి పూలు రాల్చటం మాని వేస్తుంది అని . కానీ పూలు యథా ప్రకారం రాలుతూనె వున్నై . పూలన్నీనలిపి నలిపి రాతిసిల అలిసి పోయింది . వుండబట్ట లేక చెట్టునే అడిగేసింది . "నీ పూలన్నీ నలిపి కుప్ప పోస్తూంటే తెలియడం లేదా ? ఇంకా నా మీద పూలు రాలుస్తూనే వున్నావు ? నీ పూలన్నీ అలా నలిగి పోతూంటే నీకు బాధ కూడాలేదా ?అంది .
చెట్టు చిరు నవ్వు నవ్వి "అక్కా బాధ ఎందుకు ? నువ్వు ఉపకారం చేస్తున్నావు . నాపూలని నలిపి వాటి సుగంధాన్ని నలు దిశలా వ్యాపింప చేస్తున్నావు ."అంది . చెట్టు ఉదారతని గొప్పతనాన్ని చూసి రాతి శిల తల వంచేసింది . దాని ముందు తను ఎంతో దిగ జారి పోయి నట్లుగా భావించింది . పశ్చాత్తాపం చెందింది . తనకి కీడు చేసిన కూడా చెట్టుకి కినుక లేదు . చిన్న నష్టం ఎవరేనా చేస్తే వాళ్ళని పెద్ద శత్రువులుగా భావిస్తాం ,కాని ఈ చెట్టుది ఎంత ఉదార స్వభావం ?
అన్నా ! నన్ను క్షమించు , నేను నీ అంత గొప్ప వాడినికాను .నీచ బుద్ధిని . అల్పడిని జ్నుడిని నేను కోపం తెచ్చుకొని నీపూలన్ని నొక్కి నలిపి పడేసాను .
రాతి శిల మాటలు విని చెట్టు కొద్ది క్షణాలు
నిశ్సబ్దంగా వూరుకొంది . ఆకాశపు అంచుల్లోకి చూస్తూ తనలో తాను అనుకొంటున్నట్లు అంది , ప్రతి విషయానికి బొమ్మ బొరుసూ రెండు వుంటాయి ,మనం చెడునే చూడటం అలవాటు చేసు కొంటె అసంతృప్తి , కసి , ద్వేషం పెరిగి పోయి జీవితం గడపటం దుర్భరమవుతుంది . మనం ఒకళ్లని విశ్వసించ లేము ,ఒకళ్ళు మనని విశ్వసించరు . సత్యమయిన మాట చెప్పావు .అంది శిల చెడు లోనే మంచిని వెతక గలిగితే చెడు చేసిన వాళ్ల పై వెంటనే ప్రతీకారం తీసుకోనక్కర లేదు . వాని చెడ్డ భావాలు విని ఉత్తెజితులమయి మన మనస్సాంతిని ,శక్తిని వృధా చేసుకో కూడదు . నీలాటి మహాత్ములే అలా చేయ గలరు .అంది శిల .
చెట్టు నవ్వి " అక్కా ! జన్మ సిద్ధంగా ఎవరు చెడ్డ వారు కారు , . మనం ఎలా ఆలోచించి ,ఎలా ప్రవర్తిస్తామో అలాగే తయారవుతాము . ఉత్తమ మైన అలవాట్లు , ఉన్నత భావాలే మనిషిని మహానుభావుడిని చేస్తాయి. చెట్టు చెప్పిన ఈమాటలు రాతి శిలని కరిగించాయి . అన్నా ,నువ్వు గొప్ప జ్ఞానివి ,పరోపకారివి . ఇవాళ జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో ఉపాయం చెప్పావు . నేను ఆ ప్రకారమే నడుచు కోడానికి కృషి చేస్తాను . జీవితాన్నీ , విజయ వంతంగా ,సార్ధకం చేసుకొంటాను అంది నిబ్బరంగా {అనువాదం }
No comments:
Post a Comment