ఒక రైతు దంపతులుఎగ్జిబిషన్ కి వెళ్ళారు. అతనికి విమానం ఎక్కాలని సరదా. అక్కడ విమానంలో ఎక్కించి ఒకసారి అలా చుట్టూ తిప్పి తీసుకు వస్తున్నారు.ఈ దంపతులు అక్కడి కి వెళ్లి చూస్తె పది రూపాయలు టికెట్ అని వుంది. అమ్మో అంతా? అని వెనక్కి రా బోతుంటే ఆ పైలట్ పిలిచి "ఏమి వెళ్లి పోతున్నారు?అని "ఆడిగాడు ."" టికెట్ చాలా ఖరీదు ఎక్కువ" అన్నారు వాళ్లు. సరే ఎంతయితే ఎక్కుతారు? ఏదో బేరం చెప్పాలి గాని, అలా వెళ్ళిపోతా రా?" అన్నాడు.నువ్వే చెప్పు.అన్నారు వాళ్లు. "మిమ్మల్ని విమానం లో తీసుకు వెళ్లి తిప్పి తీసుకు వస్తా,ఎక్కాక మీరు శబ్దం కూడదు.చేస్తే పది రూపాయలు పుచ్చుకొంటాను అన్నాడు .రైతు దంపతులు సరే అని ఒప్పుకొని ఎక్కారు.తిరిగి వచ్చాక పైలట్ అన్నాడు.అరె?మీరు నోరు ఎత్తకుండా కూర్చున్నా?అన్నాడు ఆశ్చర్యకరంగా! ఎంత కష్టమో నీకేమి తెలుసు? మా ఆవిడ కింద పడి పొతే నాగుండెలు అదిరి పోయాయి.అయినా నోరు మెదపలా.అన్నాడు రైతు.
***************************************
తల్లి కూతురు హోటల్కి డిన్నర్కి వెళ్లారు వంటలు బా వున్నాయి పిల్లచిన్నపిల్ల, అన్ని తిన లేక పోయారు. ఆవిడకి అవి వదిలేయడం బాధగా అనిపించింది,ప్లేట్ బోలెడు ఖరీదు.ఆవిడ సర్వేర్ ని పిలచి "ఇవి అన్ని కట్టి ఇస్తారా, మా కుక్క కి పెడతాను,అంది. ఆరేళ్ల కూతురు ఆశ్చర్యకరంగా చూస్తూ అమ్మా!కుక్కేదీ మనం ఇప్పుడు కుక్కని కొనుక్కు వద్దామా?అంది.
**********************************************
శాస్త్రి సంధ్య వార్చు కొందామంటే అరివాణం ఉద్ధరిణె రెండు ఒకటి కనిపిస్తే ఒకటి కనపడవు, విసుక్కొని ఇల్లంతా వెతికి సంధ్యవార్చు కొనేవాడు.ఘట్టిగా వాళ్ళ ఆవిడకి హెచ్చరిక చేసాడు.ఇకనుంచి అరివాణం , ఉద్ధరిణా ఒక చోట పెట్టక పోయా వంటే జాగ్రత్త.అని.మర్నాడు స్నానం చేసి సంధ్యవార్చు కొందామంటే రెండు కనిపించ లేదు.ఇల్లంతా వెతికాడు,కనిపించలా.కోపంగా భార్యని పిలచి అడిగాడు. ఆవిడ శాంతంగా సమాధాన మిచ్చింది. మీరేగా రెండు ఒక చోట పెట్టమన్నారు? చిన్నవాడు నిన్న ఉద్ధరిణ నూతిలో పడేసాడు, నేను అరివణం కూడా అక్కడే పడేసా,అంది.
********************************
ఒకావిడ చాలా పోడుగ్గావు న్డేది. ఆవిడ ఎంత పోడుగో వర్ణిస్తూ ఒకాయన చెప్పాడు"ఆవిడ ఎంత పోడుగంటే "పళ్ళు తోముకోవా లంటే ఆవిడ ఎత్తుకాళ్ళ పీట మీద నుంచోవాలి.అని.
**********************************

No comments:
Post a Comment