Pages

Monday, March 5, 2007

చక్కనివాడవయ్య

శ్రీరామనవమి ఈనెల రాబొతొంది.రాములవారి మీద ఒక పాత పాట మీకు అందిస్తున్నాను.
చక్కాని వాడవయ్య రామా రామా
మోమొక్కసారి జూపవయ్య రామా రామా
మోమొక్కసారి జూపవయ్య రామా రామా
పట్టు పీతాంబరములు రామా రామా
మాకు కట్టీ దర్శనమివ్వు రామా రామా
శంఖు చక్రముల తోడ రామా రామా
వేగ సాక్షాత్కరింపవయ్య రామా రామా
వామాంకమున సీత రామా రామా
వేగ వదలకుండ రాగదొయి రామా రామా
గజ్జెలందెలు మ్రోగ రామా రామా
వేగ ఘల్లు ఘల్లు రాగదొయి రామా రామా
భద్రాద్రి పుర నివాసా రామా రామా
వేగ భక్తులను బ్రొవుమయ్య రామా రామా
సమాప్తము.

No comments: