ఈపాట వినుమయ్య రామా
ఇది ఏపాటిదైనా ఇనవంశ సొమా
అసంకల్పముగ అంతరంగమే
ఆలపించు సంగీతమేసుమా
త్యాగరాజ రాగామృత మెరుగను
రామదాస రసకీర్తన తెలియదు
ప్రాణ పంచకము ప్రణవము పల్కగ
పరవస మంది పాడుచుంటిని
రాగము కందని అనురాగముతొ
తాళము కందని తపొధ్యానముతొ
శృతికందని విశృత భక్తితొ
గద్గద కంథము గానము చేసే
మదిలొ ఆశలు తెలుపుట కొరకు
ఉదయ మందిన గీతము కాదు
క్షణమైన నాకృతిని వినుటకన్నా
నేనాశించు బ్రహ్మానందము లేదు
No comments:
Post a Comment