రామ రామ అంటేనేచాలదా శ్రీరామరామ అంటేనే చాలదా
రాం రాం రాంసితా రాం రాం రాం
కామితములు తీరగ తామసములు తొలగగ
శ్రీమన్నారాయణ మంత్రములొ 'రా' బీజము
శివ పంచాక్షరి మంత్రములొ 'మా జీవము
రెందక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మ మైన
శ్రీరామనామమే రాజీవము ప్రాణ రాజీవము
అవధిలేని భవ జలధిని అధిగమించు నావ అది
అజ్ఞాన తిమిర తతుల అణగించే త్రొవ
చిత్తశాంతి పొందగా చిదానంద మొందగా
ఏతపము చేయకయే ఏకాగ్ర సమాధి నీయ
అశాంతియే అలుముకొన్న తరూణములొ
ఆదరించి వడి చేర్చే అమ్మవంటిది
ఆవేదన ముసురుకొన్న అన్ని వేళ లందున
ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిదినాద బ్రహ్మ
No comments:
Post a Comment