Pages

Thursday, March 8, 2007

కంప్యూటరు దండకం

కంప్యూటరాయ నమౌ నమ:
కలికాల జీవనవిధారణ తారణొపాయనమ:ఉచ్చ,నీచ,బీద,గొప్పతారతమ్య రహిత తారణ మంత్రాయ నమ;యువ మానసరాజ హంసాయనమ:ఇంటింటీ దేవతాయై నమ:చదువుకున్,పాటకున్, మాటకున్,ఆటాకున్,తపాలాపనికిన్,పద్దులకున్,హద్దులు దాటీంచే విహారాలకున్,ప్రచురణలకు ప్రణయాలకు,పరిణయాలకు,విపణికిని, కవితానిపుణులకు,అర్ధాలకు,ఆరొగ్యానికి,విమర్శలకు వినొదానికి పంచాంగానికి,ప్రయాణాలకు,టీక్కెట్ళకి,దారిచూపడానికి,టైము తెపడానికి,వాత్రలకి,ఇంకావేవేల సలహాలకి,సహాయానికి,నీకన్న మాకెవ్వరే దిక్కు?అన్నదాతా!ఉద్యొగ దాతా!అనర్గళ పాండీతీపటీమపొట్టలొ దాచిన నేతా!బడేణ్దుకు, కాలేజీ ఎందుకు,సినిమా హాలెందుకు,చింత లేక నీ చెంత కూర్చుని పొందరే మా,హాయినీ,శాంతిని,ఆనందాన్ని,అద్భుతాన్ని.నేను లేనిదే నువ్వుందలేవు మానవా! అంటావుకాని,నేనులేందే నీఅంతట నువ్వు ముందుకెళ్ళగలవా? దారితెలియని బాటసారిలా నిలబడిపొతావు.లేకపొతే తుర్రుమనీంటీకి పొతావు, ఆవలించి నిద్ర పొతావు ఒక్క అక్షరం అటూ ఇటూ అయితే కామా, ఫుల్స్టాప్ లేకపొతేదిద్దు కొలేని దద్దమ్మవుకదా?నేనే ేదదిద్దాలి.చిన్న తప్పునే భరించవు!మొదటీనుంచీ మంగళం పాడీ చెరిపేస్తావు.జాలిలేదు, కరుణ లు,కొత్తవారనిలేదు,పెద్దవారనిలేదు,కరకు గుండే కంపూటరూ ఎన్ని గుండేల్లొ తిష్ట వేసావే!ఇంట్లొ నువ్వొక అలంకారం,అవుసరం అయిపొయావే!ఇంటర్నెట్ను వెంటేసుకొని ఎన్ని హొయలు పొతున్నావే!మధ్య మధ్య యాడె లని డెస్క్ టాప్ మీద గెంతించి మమ్మల్ని విసిగిస్తావ్ నువ్వు సంపాదిస్తావ్ . బల్లలమీంచి ఒళ్ళొకి జారావే లాప్ టాపేరుతొ!పిల్లల్ని ఎత్తుకొడానికి ఓపిక లేని తల్లులు లాప్ తాప్నిపాపాయిలవలేఒడిలొన లాలిస్తున్నారే!రొజులొ సగ భాగం దాని మొజులొనేగడిపేస్తున్నారే!మనిషి జీవితం లాప్ తాప్ లొ ఇరుక్కు పొతొందే! ఏది ఏమయినానీ సేవ గొప్పదినీ రూపుచక్కనిది.జొహారు కంపుయు టరూ జొహారు లాప్ టాపు వర్ధిల్లు, వర్ధిల్లు,చిరకాలం వర్ధిల్లు.
రచన టి్.జి్.ప్రసూన

3 comments:

Anonymous said...

Adbhuthamaina dhandakam!

ranjani said...

ఈ కంప్యూటరు దండకాన్ని మరో సైటులో పోస్టు ( కాపీ పేస్టు ) చేసాను . అభ్యంతరం ఉంటే తెలియచేయగలరు
http://mahigrafix.com/forums/showthread.php?tid=4494

ధన్యవాదములు

Unknown said...

me tilevki na danyavadamu