ఆంధ్రులార! ప్రవాసాంధ్రులార!
కొయిలమ్మ కూయలేదని
కొరత పడబోకన్
స్నేహ మాధురి ముంచి పలికే
పలుకులే కొయిలల పాటలు
మావిపూవుల గుత్తులేవని
మదిలొ చింత మానండి
చిన్ని, చిట్టిల గీత నృత్యాల్
అవే కళలకు పూల గుత్తులు
చేవ నిండిన చెరుకు ముక్కలు
చేతి కందని ద్రాక్ష పళ్ళా?
ఒకరికొకరై కలసి మెలిగే
ఐకమత్యమే చెరుకు తీపి
రుచులు పందించుట ఇచ్చుట
ఋతువులకే చెట్లకే వచ్చా?
రీతి నెరిగి-ప్రీతి పలికితే
పచ్చడెందుకు పలుకు చాలు
యుక్తి, శక్తి,రక్తి కలిపి
మహాయానం సాగిస్తొంతే
మలుపు, మలుపున ఉగాదే
తలపు, తలపున సౌఖ్యమే
No comments:
Post a Comment