Pages

Wednesday, April 11, 2007

ఉనికి ekkaDa

ఉనికి ఎక్కడ? రచన సత్యవాణి
తాత లిచ్చిన తరగని ఆస్తిలొనా?
దానితొ కొన్న అల్పాయుష్షు అధికారాల్లొనా?
చిరు కాలపు స్నేహాల్లొనా?
అనాయాసంగా జన్యువులు మొసుకొచ్చిన
అంద చందాల్లొనా?
అలాగే అబ్బిన ఆటపాటల్లొనా?
అతి తెలివి తేటల్లొనా?
పుణ్య భూమిగా చెలామణి అవుతున్న భరతాన్ని
జన్మ భూమిగా చెప్పుకొని ఆటొమాటిక్ మొరాలిటి
ఆపాదిచుకొడంలొనా?
గాయపడ్డ అహాన్ని సుబర్బన్ అడ్రెస్ లొ
ఇరుగు పొరుగు వారి పాపులారిటిలొ సాంత్వన
పరచుకొడంలొనా?
ఆధునిక సదుపాయాలున్న లంకంత ఇంటిలొనా?
అందులొ అందంగా అమర్చుకొన్నయాంటిక్ కలక్షన్ లొనా?
తర్కించు కొకుండా తస్మదీయుగాతలపొసిన వారిని
తిరస్కరించడంలొనా?
వారి చేష్టల్ని వెక్కిరించి వ్యతిరేకించడంలొనా?
చదివిన గ్రంధాల సంఖ్య లొనా?
చూసిన దేశాల లెఖ్ఖ లొనా?
అనారొగ్యం అర్జించి పెట్టిన ఆదరణకి
పేదరికంప్రకటించి సమకూర్చుకొన్న సానుభూతికి
అతుక్కుపొయి పరాన్న భుక్కులుగా మనుగడ
సాగించే నికృష్టపు జీవనంలొనా?
అవసరానికి ఆధారపడ్డ వారి అభినందనలకి
అలవాటుపడి
పర్మెనెంటుగా వారిని పరాధీనుల్ని చెయ్యడంలొనా?
కిట్టని లేనివాళ్ళలొ కుత్సితాన్ని
మొజుపడ్డవాళ్ళలౌందనుకొన్నఔన్నత్యాన్ని
అదే పనిగా వల్లించడంలొనా?
పిల్లలతొ బట్టె కొట్టీంచిన సంస్కౄత శ్లొకాల
సంఖ్యలొనా?
వారిసాట్ స్కొర్ అంకెల్లొనా?
ఇతరులు చేసే అతిథి సత్కారాల్లొనా?
వారిచ్చే అభినందనల్లొనా?
పై అధికారి ప్రశంసల్లొనా?
క్రింది పనివాదీతి వినయపు అణుకువల్లొనా?
బలహీనుల్ని లొకువ చెయ్యడంలొనా?
బెదిరించి బుకాయించే వారికి లొంగిపొ వడంలొనా?
తప్పిపొయిన పెళ్ళి సంబంధాలలొనా?
దొరకని కాలేజి సీట్లలొనా?
రాని ఉద్యొగాల లొనా?
పనికి రానివారుగా పరులు వేసిన ముద్రను
పదిలంగా కాపాడుకొటంలొనా?
లేక
పరమాత్మ ప్రతినిధి అంతరాత్మ
అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పి
ఒప్పుకొన్న తప్పుల సంఖ్య తగ్గించుకొంటూవచ్చే
మనసుకి తట్టిన ఔన్నత్యపుపనుల సంఖ్య
క్రమంగా పెంచుకొంటూపొయే
వర్ధ మానపు భావి దిక్కుగాసాగే పయనం లొనా?.

No comments: