రెండు చిలకలు మీర లీల పరిచయం టీ. జ్ఞాన ప్రసూన
సాహితీ మిత్రులు మీటింగ్కు వెడితే17 శనివారం రొహిణీ ప్రసాద్ గారు వస్తున్నారమ్మా! మీరూ రండి,అన్నారు జయదెవ్ గారు,రాణి సంయుక్త గారు ఇన్విటేషన్ చేతికిచ్చారు.ఇలినాయిస్ హిన్సిడేల్ కమ్యూనిటి సెంటర్ లొ హండ్ ఇన్ హండ్ అనే సేవా సంస్థ సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటుచేసారు. నేను మా అబ్బాయి వెళ్ళాము.
రెండు పొద్దుతిరుగుడు పూలు గాలికి వూగుతూ ఒకదానితొ ఒకటి కబుర్లు చెప్పు కొంటున్నట్లు,రెండు చిలకలు ఒకదానితొ ఒకటి పలకరించుకొంటున్నట్లు , ఇద్దరమ్మాయిలు స్టెజి మీదఫాట పాడుతున్నారు,రొహిణి ప్రసాద్ గారు కీ బొర్డ్ వాయిస్తున్నారు.పాట పాడే అమ్మాయిల పేర్లు మీర-లీల. మధురంగా సునాయాసంగా పాటలు పాడారు.వీళ్ళిద్దరూ కబుర్లాడుతూ చెప్పిన వివరాలు.రెండొ తరగతి నుంచీ మేము సంగీతం నేర్చు కొంటున్నాము.మా మొదటి గురువు శ్రీమతి బాలామణి గారి శిష్యురాలు శ్రీమతి సుమతి సుబ్రహ్మణ్యం .తరువాత సంగీత కళానిధి నేదునూరి కృష్ణ మూర్తి గారి శిష్యురాలుశ్రీమతి పద్మావతి త్యాగరాజుగారు.మేము బొంబాయిలొను ,జబల్ పూర్
లొను,హైదరాబాద్ లొనుచదివి ఇప్పుదు హామిల్టన్ సౌత్ ఈస్టరన్ హైస్కూల్ షిప్ఫర్స్ ఇండియానాలొచదువుకొంటున్నాము.అన్నారు. లీలా మీరు
అప్పటి నుంచి సంగీత సాధన చేస్తున్నారుకదా?సంగీతం అంతే మీలొ ప్రేమా ఆరాధనా పెరిగిపొయి వుంటాయి,అన్నాను.అవును.మేమిద్దరము సంగీతాన్ని ప్రేమిస్తాము.సుధా రఘునాధన్,బాల మురళి కృష్ణ లపాట ఇష్టం.శ్రేయ ఘొషాల్ ,సొము నిగం పాటలు,పాశ్చాత్య సంగీతం అన్ని వింటాం .స్పానిష్,రుమేనియన్ సంగీతం పసందుగా వుంటుంది.అన్నదిలీల. ఒకేపాటలొ రక రకాల మార్పులతొ పాడాలంటే నాకిష్టం పాత బాణీలొనే పాడి వినిపించాలంటే ,మెప్పించాలంటేఅదొక చాలెంజి అయిపొతుంది.శాస్త్రీయ సంగీతంలొ రాగ, తాళాల వైవిధ్యంతొ పాడాలనిపిస్తుంది. లలిత సంగీతం కంటేశాస్త్రీయ సంగీతంలొ రాగ, తాళాలవైవిధ్యం తేవడం వల్ల -పాట పాడేఅ వాళ్ళ లొ వున్న సృజనాత్మక శక్తి వెల్లడి అవుతుంది.లలిత సంగీతం అలా పాడితే వినే వాళ్ళకి బాగుంటుందికాని, పాడేవాళ్ళకి పెద్దతృప్తినియ్యదు. లలిత గీతాలు పాడుతొంటే శ్రొతలు పాతబాణీనే తల్చుకొంటారు కొత్తదనాన్ని పట్టించుకొరు.పైగా మార్పుచేస్తే హర్షించకపొవచ్చు.అంది మీర.మానాన్నగారు కాళీప్రసాద్ వి తనికెళ్ళ,మా అమ్మసీత ఎం తనికెళ్ళమాకు స్పిరిట్. మారుచులకి-చదువుకు ఎంతే దొహదం చేస్తారు,అంది లీల.ఇకపై సంగీత ప్రపంచం లొ లీనమైపొతారా?లేక,అన్నాను.లేదండీ.ప్రస్తుతం నేను మెడిసన్ చదవాలని ప్రయత్నం చేస్తున్నాను.సంగీతం మాత్రం వదలను.శాస్త్రీయ సంగీతంలొ ప్రావీణ్యం సంపాదించి కచేరీలు చేయాలని ఊహ,సంగీతం ఇష్ట పడే వాళ్ళ్కి నేర్పించాలని ఆశ. మాచెల్లి లీలకు కంప్యుటర్ మీద అభిమానం-ఆర్ట్ అంటే ఉత్సాహం.అందిమీర.
No comments:
Post a Comment