ఒక విద్య అంటే సంగీతంకాని,చిత్ర లేఖనం కాని, రచన కాని,ఒక్కటే నేర్చుకొంటే బాగా వస్తాయా?లేక రెండు, మూడు కళలు ఒకేసారి నేర్చుకొ
హలమా? అన్నాను.
వ్యక్తి యొక్క భావన,అవకాశాలు,వాళ్ళు దానికొసం కేటాయించే సమయం వీటిమీద ఆధార పడి వుంటుంది.గంభీరమైన,ధృఢమైన కృషి చేసి,తమంత తాముగా ఇష్టపడి , దానిపై శ్రధ్ధ చూపిస్తే ఒకే సమయం లొ ఒక్క లలిత కళేకాదు రెండు మూడు నేర్చుకొవచ్చు, అంది మీర.మీరు ఏమయినా ప్రయత్నించారా? అన్నాను. నేను మాచెల్లి కరాటా ప్రావీణ్యులం ,
రాష్త్ర స్థాయిలొ,జాతీయ స్థాయిలొ ఇద్దరికి 50 పతకాలు వచ్చాయి.గవెర్నమెంట్ ఆఫ్ ఇండియ ఫైన్ ఆర్త్స్ అన్ని శాఖల లొను కలిపి 210 స్కాలర్ షిప్లు ఇస్తారు. అందులొ నాకు స్కాలర్ షిప్ దొరికింది,అంది మీర.
సంగీతం వల్లమీకేమయినా ప్రత్యేకమైన ఉపయొగం కలిగిందా? అన్నాను.
సంగీతం మనస్సుకు తౄప్తినిస్తుంది .మనిషి స్థాయిని పెంచుతుంది.శాస్త్రీయ పరమైన జ్ఞానం పొంద గలిగితే ఏ పాట విన్నా తాళమేమిటీ? అది ఏరాగంలొ పాడుతున్నారు? అనేది గుర్తించ కలుగుతాము.ఏభాషలొ విన్న సంగీత మైనా
అర్ధం చేసుకొని ఆనందించ కలుగుతాము.వినడం,నేర్చుకొవడం,మరొకరికి చెప్పడం వీటివల్లసంగీతపు లొతుల్ని అనుభ వించ కలిగే శక్తి వస్తుంది.సంగీతం సంజీవని లాంటిది.పాడేవాళ్ళకి వినేవాళ్ళకి ప్రాణం పొస్తుంది.అంది మీర.
ఇంకా చెప్పండి అన్నాను.
టివి ప్రకటనలకి డబ్బింగ్ చేసాము,టివి సీరియల్స్ కి డబ్బింగ్ చేసాము.వివిధ భాషలలొజింగిల్స్ పాడాము,సంగీతం అంతే మాలొ కొత్త శక్తి వస్తుంది అన్నారువాళ్ళు.
పిన్న వయసు లొనేసంగీతం లొ ప్రావీణ్యము సంపాదించి చక్కగా పాడుతూ మురిపించి మెచ్చికొళ్ళు అందుకొంటున్నారు ఈచిన్నారులు.
రొహిణి ప్రసాద్ గారితొ మీకెలా పరిచయ మైంది? అన్నాను.వాళ్ళమ్మగారు సీతతొ
మేము బొంబయిలొ వుండగా రొహిణి ప్రసాద్ గారుకూడ అక్క్డ వుండేవారు.మాపెద్దమ్మాయి ఏడేళ్ళ వయసులొ వయసులొ ఒక సభలొ పాడుతూంది. ఆయన బయట నిలబడి విన్నారట. పాటలొ అది వేసిన గమకం ఆయనకి నచ్చి లొపలికి వచ్చి ఆ అమ్మాయి ఎవరని అడిగిఈఅమ్మాయిసంగీతంలొ ప్రవీణురాలవుతుంది. నాపేరు రొహిణి ప్రసాద్ ఎవరినేనా అడిగి తెలుసుకొండి.నాదగ్గరకి అమ్మాయిని పంపుతే ఇంకా నేర్పిస్తాను అన్నారట.కొన్ని పాటలు నేర్పించారు. నేను ఇంటిలొ ప్రాక్టీసు చెయిస్తాను అన్నాను. మీరుచేయిస్తా నంటే మీకెంత సంగీతం వచ్చొ నాకు తెలియాలికదా?పాడి వినిపించ మన్నారు. పాడాను.ఆతరవాత ఆయన తొపాటు పాడుతూండేదాన్ని. అన్నారు సీత. రొహిణి ప్రసాద్ గారు పెద్ద సైంటిష్టు ,సితారు వాయిస్తారు,సంగీతంలొ దిట్ట,ఏకసంతాగ్రాహి,స్వయంగా పాటలు వ్రాసి, బాణీలుకట్టి పాడతారు.అన్నారుసీత
ఆరొజు సభలొ అందరికొరిక పై రొహిణిప్రసాద్గారు ఘంటసాల పాటలు పాడారు, సీత, రొహిణీప్రసాద్ గారు కలిసి పాతాళభైరవిలొ యుగళగీతం పాడి ప్రేక్షకులను అర్ధ శతాబ్దం వెనక్కు తీసుకు వెళ్లారు. అప్పుడనుకొన్నాను,మీర,లీల లకు సీత ఉగ్గు పాలతొ సంగీతమ్నేర్పించింది.అని.
No comments:
Post a Comment