Pages

Saturday, April 14, 2007

అశోక్ ముద్రకోల

v మరుగున పడుతొంది మన తెలుగు సంస్కృతి
రచన-అశొక్ ముద్రకొల
సన్నకారు,చిన్నకారు భూస్వాములలొ
నవధాన్యాలను పండించి పంచుకొనేది మనరీతి
కాని సన్నకారు రైతు సంఖ్య క్షీణతలొ
మరుగున
మాతపితల సేవ జీవిత పరమార్ధ మనేది
వారి కడ దశలొ సంతొషాన్ని నింపాలన్నది మన పధ్ధతి
కాని పట్టణ ప్రయాణాలతొ,పరదేశ వలసలతొ
మరుగున
పట్టు పరికిణీ పరపరలతొ,పూల జడల సొయగాలతొ
అలరారి పొయి ఆనందాన్నివిరజల్లేది మనప్రకృతి
కాని జీన్ పాంట్స్ బాబ్డ్ హైర్ పాపులారిటీతొ
మరుగున
కూచిపూడి భరత నాట్యాల పొషణం
ఇతర లలిత కళలకు కొంత ప్రొద్బలం మన ఆచారం
కాని బాంగ్రా రీమిక్ష్ మ్యుసిక్ ప్రాబల్యంతొ
మరుగున
ఉగాది ఏరొజొచ్చినా ఆరొజు పంచాంగ శ్రవణం
పొణ్య గొపురంలొ కాల యాపనం మన సంప్రదాయం
కాని మండే టు ఫ్రైడేలు జాబ్ టెన్షంతొ
మరుగున
పరదేశం లొ నైనా తెలుగును మర్చిపొలేనిది
దానికై సన్స్కృత సంఘాలను నెలకొల్పేది ఆనవాయిత్
కాని ఆసంఘాలలొ సభ్యత్వం కొరవైపొయి
మరుగునపడుతొంది మన దేశ సన్స్కృతి

No comments: