ఉగాది అనగానే
కవులు కలవరించే కోయిల
భక్తులు పలవరించే కోవెల
నా మది లో మెదలలేదు
మావీది చివర కొళ్ళాయి దగ్గర
ఇంకా తెలవారక ముందే
వంతులకోసం జరిగే తంతుల పోరాటం
ఎగిరిపడే బిందెల ముశ్టియుద్దం లో
ఛతగాత్రుల ఆర్తనాదం
రిక్చాలోనుంచి దిగలేక
బస్తాలా దొర్లి చప్పుడు చేయక తలుపు తీయమని
అర్దరాత్రి అర్తించే తాగుబ్రోతు భర్తను
తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే
మా సందులో గోయిందమ్మ సంగీత కచేరి
పండక్కి పట్టిచ్చిన
కొత్త చొక్కా కుట్టినా దానికి
ఇంకా ఖాజాలు కుట్టని
పీరుసాబు మిశను దగ్గర అసహనంగా
చిందులు వేసే చంద్రయ్య
శీకాయ పొడితో నెత్తికి నీళ్ళుపోయాలని
వాళ్ళమ్మ చేసే విశ్వ ప్రయత్నాలు
తప్పించుకొనిపోయే మామేనకోడలు ఉమ
మునం బట్టి
కొడవళి పట్టి
రెండకరాల జొన్న కోసి వోజలుపెట్టే
మా ఎసోబుపెళ్ళాం సుజానమ్మ పాడేపదం
ఇంకా మరవ లేని నిజాలు
ఇంట్లో అమ్మ కాల్చిన అత్తరాశలు
లింగమయ్య సార్ కు అతి జాగ్రత్తగా
తీసుకపోతే
పక్క జోబిఅంతా నునె మయం
సాయంత్రానికి వీపు పగలడం ఖాయం
ఇవన్నీనా మదిలో మెదిలే జ్ఞాపకాల దొంతర
ఇక ఇప్పుడు.......
అధికార బలం తొ
సర్వం జీత్ కావలనుకునే
జిత్తులమారుల
గర్వం చిత్తై
జనావళికి
సర్వమంగళం జరగాలని
ఈ సర్వజ్ త్ సాక్స్చిగా కోరుకుంటున్నాను
మార్చ్ 19, 2007
No comments:
Post a Comment