Pages

Monday, May 21, 2007

విదేశాన్నుంచి స్వదేశానికి మార్చి27న బయలు దేరి వచ్చాను.మంచు కొందల మీంచి గాడిపొయ్యి దగ్గరికి వచ్చినట్లుగావుంది.ఇదొక మహా ప్రయాణం.చదువులకి, ఉద్యొగాలకిపిల్లలు, విదేశాలకి ఎగిరి పోయి అక్క డే స్థిరపడిపోతే అమ్మలు,నాన్నలు,అమ్మమ్మలు,బామ్మలూ, తాతయ్యలు అప్పుడప్పుడు ఆకాశయానం చెయాల్సిందే.అలాగే నేనూ వెళ్ళి మావాళ్ళతొ ఎనిమిది నెలలు గడిపి వెనక్కి రావాలంటే గుండెలు చిక్కబెట్టుకొవాల్సి వచ్చింది.చితికిన మనస్సుతొ రొజంతా ప్రయాణం చేసి జన్మభూమికి వస్తే వడిసెలలొ పెట్టి గిరవాటేసినట్లు విమానం తెచ్చి పడేస్తుందేమొ వళ్ళు వశం తప్పి పొతుంది.మళ్ళి మామూలు మనిషవాలంటే నెలరొజులు పడుతుంది. అదుగొ అందుకే 'సురుచీ వంక చూడలేక పొయాను. ఇక మీదట సాహితీ వ్యవసాయం సక్రమంగా చేయగలనని ఆశిస్తున్నాను,ఆచదువుల తల్లిని ఆశీర్వదించ మని ప్రార్ధిస్తు న్నాను.
జ్ఞాన ప్రసూన.

7 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

మిమ్మల్ని ఎలా సంబోధిస్తే బాగుంటుందో తెలియట్లేదు. మీ బ్లాగు బహు బాగు. ఎంత చక్కటి విషయాలు ఎంత చక్కగా చెప్పారో! మీ టపాలు చూస్తే మీ ప్రతిభ, పరిణతి తెలుస్తున్నాయి. మీ టపాలు, సందేశాలు, సూచనలు బ్లాగర్లందరికీ అందించండి. మీ జీవితకథ- అనుభవాలు, అనుభూతులు, స్వప్నాలు, వగైరాలు - వ్రాస్తే బాగుంటుంది.

oremuna said...

Nice Blog

C. Narayana Rao said...

మీ రాతలు చాలా చక్కగా ఉన్నాయి.భాషా ప్రయోగం సైతం బహు లెస్సగా ఉంది, మచ్చుకి:
'మంచు కొందల మీంచి గాడిపొయ్యి దగ్గరికి వచ్చినట్లుగా; వడిసెలలొ పెట్టి గిరవాటేసినట్లు విమానం తెచ్చి పడేస్తుందేమొ వళ్ళు వశం తప్పి పొతుంది; సాహితీ వ్యవసాయం'
Please keep the good work going.

కొత్త పాళీ said...

జ్ఞాన ప్రసూన గారూ, మీ బ్లాగుని కనుగొని చాలా ఆనందం వేసింది. వర్తమాన పరిస్థుతులు వాటితో పాటు మీ చిన్నప్పటి జీవితం విశేషాలు, పరిస్థితులు .. మీ ఆటలు, స్నేహితులు, ఏం చదివే వారు, ఏం తినేవారు .. ఇట్లాంటి విషయాలు కూడా మీకు తోచినట్టు చెబుతూ ఉంటే బాగుంటుంది.

రానారె said...

గాడిపొయ్యి, వడిసెల లాంటి పదాలు మాట్లాడారంటే సాహితీవ్యవసాయం చేయడం మీ వృత్తిలా ఉంది. ఈ రోజే మీ బ్లాగు గురించి తెలిసింది. తీరికగా చదువుతాను.

రాధిక said...

తెలుగుపీపుల్ డాట్ కాం లో రాసే ప్రసూన గారు మీరేనా?

సిరిసిరిమువ్వ said...

చక్కగా రాస్తున్నారు. మీ బ్లాగులు చదువుతుంటే మీరు ఎదురుగా కూర్చుని కబుర్లు చెపుతున్నట్లు వుంది. మీ జీవితానుభవాలు కూడా రాయండి మాకు పాఠాలుగా పనికి వస్తాయి.