Pages

Sunday, May 27, 2007

పిలుపు లో సొగసులు vyaasam

పుట్టినప్పటి నుంచీ ప్రాణి చెవుల్లొ అమ్మ పిలుపులు వినపడుతూనే వుంటాయి.పూట్టగానే పేరు వుండదుకనుక ఆడా,మగా బేధం లేకుండా పిల్లల్ల్ని చిట్టి, చిన్ని,బుజ్జి బజ్జి,కన్నా,నాన్నా,చంటీ,బంటీ,రింకీ,పింకీ,టుంకూఅంటూ పిలుస్తూ వుంటారు.పిల్లలు బొద్దుగా వుంటేబొండాం,డాంబొ,లడ్డూ,బాటా బాలూ అన పిలుస్తారు.అంతటితొ వూరుకోక సన్యాసి,బడ్డు, భడవా మొద్దూఅంటారుకూడా.ఒకవేళ అసలుపేరుతొ పిలిస్తే ముందు వెనకా అక్షరాలు కత్తిరించి వికృతంచేసి పిలుస్తారు.చిన్నతనంపపోయాక ఈ ముద్దుపేర్లు వినసొంపుగా వుండవు.పిలుపుతో వాళ్ళ మనసులో వుండేప్రేమా,అభిమానం,కోపం,అసూయ,ద్వేషం వ్యక్తమవుతాయి.మనసులొ ఎలావున్నా ప్రేమగా పిలిస్తే నాదస్వరం వూదినట్లు అయిసు అయిపొతారు మనుషులు.
పెళ్ళయితే భార్యా,భర్తలు పెరు చెప్పటానికే సిగ్గు పడిపొతారు. భర్త భార్యని పేరు పెట్టి పిలవడానికి హక్కువుంది కానిభార్య భర్తని పేరుపెట్టి పిలవకూడదనేవారు.ఎలా?
ఏమండీ,మిమ్మల్నే,ఇదుగొ, మాట అంటూ పనిగడుపుకొనేవారు.ఆధునికత పెరిగాక భార్యలు,భర్తని పేరుపెట్టి పిలుస్తున్నారు.కొంతకాలం పేరుకి గారుతగిలించేవారు.తరవాత గారెలు వండలేక మానేసారు.ఏకవచన ప్రయొగంలొకి దిగారు.భార్యకి,భర్తకి మధ్య అరమరికలు,దాపరికాలు,హొదాలు, అడ్డుగోడలు వుండకూడదు.వారిద్దరే వున్నపుడు ఎలాపిల్చుకొన్నాఫరవాలేదు. నలుగురి ఎదుటపిలిచేటప్పుడు ఆజ్ఞ,గర్వం,కర్కశత్వం,హద్దులేని చనువు స్వరంలొధ్వనిస్తే వినేవారికి కర్ణకఠొరంగా వుంటుంది. మానవ జీవితంలొ ప్రతి సంభన్ధానికి ఒక హద్దూ,గౌరవమూ వున్నాయి.ఈసంగతి భర్త అయినా, భార్య అయినా సర్వకాల సర్వావస్తలలొనూ గుర్తుపెట్టుకొవాలి.భర్త భార్యనిఒసే ,ఏయ్, ఏమే,బుధ్ధావతారం,పిచ్చిమొద్దూ,బండమ్మ దద్దమ్మ[ఆ అమ్మయిభి.ఎ ,ఏం ఏచదివినాసరే ] పిలుస్తూంటే చిరాకుగా వుంటుంది.మాటలచేత దేవతలు మన్నన చేసి వరాలు ఇస్తారట.పిలుపుల వల్ల కూదా ఎంతొ మన్నన ఈయవచ్చు ,పుచ్చుకొవచ్చు.ఉత్తరాదిలొ పిల్లల పేర్లు పెట్టి తల్లులని పిలుస్తారు.''యమునాకిమా'అంటాడు భర్త .ఇరుగు పొరుగు వారు అలానే పిలుస్తారు.దీనివలన ఆ స్త్రీకి ఒక గౌరవమైన పిలుపు అందుతుంది.పిలుపు లెందుకు సౌజ్ఞలే చాలు అన్నిపనులు అయిపొతాయి అంటారు.ఈకంప్యూటర్ యుగంలో అంత స్థిమితం ఏదీ మనుష్యులకి?అరిస్తేనే చెవులలొ పడటంలా సౌజ్ఞ చూసి పనిచేసే నెమ్మది ఎక్కడుంది?కొందరు పిలుపుల్లొ తేనెలు కురిపిస్తారు,పరీమళాలు వెదజల్లుతారు,ప్రేమని ప్రకతటిస్తారు,ఇష్టాన్ని ఇంతింతగా వ్యక్త పరుస్తారు.మాతాతయ్యకి బాగాకొపం వుండేది. మాబామ్మ మీద అస్తమానం అలిగేవాడు.అలాటప్పుడు మాబామ్మ ఆయన ఎదుటికి వెళ్ళేదికాదు.భొజనం పెట్టాలంటే మనుమరాలినొ, మనమడినొ పిల్చీ'ఆపెద్దమనిషిని స్నానం చేయ మని చెప్పండమ్మా! వంట అయింది. అనేది.భర్త బజారునుంచి రావడం ఆలస్యమయి ఎదురు చూస్తున్న భార్య స్వగతంలో పిచ్చి బ్రాహ్మణుడు ఎండ నడీ నెత్తి కొచ్చినా భొజనానికి ఇంటికిరాలా !ఏమిపనొ ఏమిటొ అంటుంది.ఇంటీకి ఏదైనా కొత్త వస్తువు కొని తెస్తే పక్క వాళ్ళకి చూపించి మురిసిపొతూ 'మావారే వద్దంటున్నా కొని తెచ్చారు,మా ఆయనే పట్టుకొచ్చారు, మా యజమానే మూడు వందలు పెట్టి తెచ్చారూఅంటుంది భార్య.మీరు బొత్తిగా అర్ధం లేని పనులు చేస్తున్నారు,ఇక ఆపేస్తే మంచిది.అంటుంది భార్య.ఇలా గౌరవ ప్రదంగా మందలించేసరికి ఆయన మంచి, చెడూ ఆలొచనలొ పడతాడు.మరొ మహిళ 'ఏమిటి రాజేష్! ఏంపని ఇది?నిన్నగాక మొన్న నాలుగు వందలు డ్రా చేసావు,మళ్ళి ఇవాళ,చేసే పనికి అర్ధం వుందా?ఇక నాకు చెప్పకు,చాలు, వెళ్ళు.''అంటే అవతల వ్యక్తికి ఎలావుంటుంది?
ఈ మధ్య ఒకరింటికి వెళ్ళి ఒక వారం గడిపాను వాళ్ళింట్లో భర్య భర్త ఇద్దరే వుంటారు . ఇద్దరు అరవైల దగ్గరికి వచ్చారు. వాళ్ళింట్లో నాకు నచ్చింది వాళ్ళ పిలుపులు.సంభొధన ఎదుటి వ్యక్తి హౄదయాన్ని తట్టీ లేపుతుంది. ి.పేరు పెట్టి పిలిస్తే ఓహొ!నన్నే పిలుస్తున్నారు.నాకు వీళ్ళకి మధ్య చుట్టరికమొ, స్నేహమొ,పరిచయమొ వుందీని ఆపిలిచిన వ్యక్తి చైతన్య వంతుడవుతాడు. శ్రధ్ధగా వింటాడు.నేను మెచ్చిన ఆ దంపతుల పిలుపులు వినండి.ఏమండోయ్,ఆర్టిష్టుగారూ వంట అయింది.అన్నం వేడిగావుండగానేఆరగిస్తారా?అనేది ఆవిడ.
వస్తున్నానండీ బంగారమ్మగారూ!ఈఒక్క స్కెచ్ పూర్తి చేసి వద్దామని,కాదంటే వెంటనే వస్తా'' అనేవాడాయన.పక్కింటివాళ్ళు వచ్చి పిన్నిగారున్నారా! అంటే''లేకేం !అదుగొ,శకుంతలలా వనవిహారం చేస్తూ చెట్లకి నీళ్ళు పొస్తొంది.అనేవాడు ఆయన
''ఏమండీ! పార్టీకి ఇంత లేటుగా వచ్చారు!అంటే,అదిగొ! ఆమహాపండితుడుగారు కంప్యూటర్ ముందునుంచి లేస్తేనా రావడానికి,''అనేది ఆవిడ
ఓ!కిచెన్ క్వీనూ నే బజారు వెడుతున్నా ఏమికావాలొ సెలవిస్తే తెచ్చి పడేస్తా.అనేవాడయన.అలాగే నండీ!ప్లానింగ్ కమిటీ మెంబర్ గారూ ఇప్పుడు చెప్పకపొతే మళ్ళి బడ్జెట్ వచ్చేదాకా సరుకులు గ్రాంట్ కావుగా! అనేది ఆవిడ. ఇలా రొజూ కొత్తకొత్త పేర్లు సృస్ష్టించుకొని గొముగా,ఉషారుగా ,మర్యాదా పరిధి దాటకుండా ఏడు రొజులు ఏడురంగుల తొ నింపుకొని బ్రతుకులొ ఇంధ్ర ధనుస్సు చిత్రించుకొంటున్నారు.
జ్ఞాన ప్రసూన

1 comment:

రానారె said...

మంచి పిలుపు అనేది భార్యాభర్తల నడుమ అనే కాదు, ఎవరి మధ్యనైనా సయోధ్య కుదిరేలా చేస్తుంది కదా. ఇలాంటి సున్నితమైన విషయాలు ఒకటిరెండు నేర్చుకున్నాను మీ మాటలు చదివి. గుర్తుంచుకొంటాను. ధన్యవాదాలు.