Pages

Monday, July 2, 2007

శ్రీ దాసు శ్రీరాములుగారు

శ్రీ దాసు ాములు గారిది భారీ విగ్రహము.నల్లకోటు,జరీ తలపాగా, జరీ ఉత్తరీయము వల్లె వాటుగా వేసుకొనేవారు.కొనదేరిన ముక్కు,కాంతి వంతములైన కళ్ళు,పాదముల జీరాడు సరిగంచు ధోవతీ
,గోష్పాదమంత చిన్న జుట్టు ముడి,రవసెల్లా భుజము మీద ధరించి కలము పట్టుకొని శాస్త్రవేత్త ,శిష్తాచార పరాయణుడు, దాత- నేత,ప్రగతి శీలి,కలముతో పాటు హలము పట్టిన వ్యక్తి.పశు వైద్యం కూడా తెలుసు.''భృంగరాజ మహిమ ''అనే గ్రంధం గుంటగలగర ఆకు మీద వ్రాశారు.ఈయన వ్రాసిన 'అభినయ దర్పణం ' అనే గ్రంధం చదివిన తరువాత, ఏకళాకారుడుఈయనకు నమస్కరించ కుండా నౄత్యం ప్రారంభం చేసేవారుకాదుట.సముద్ర ప్రయాణం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అంటే ఈయన బందరు నుండి మద్రాసు దాకా ఓడ ప్రయాణం చేసి ప్రాయశ్చిత్తం చేసికోలేదట.నిత్యం జరిగేవాటికి ప్రాయస్చిత్తం అఖ్ఖర లేదని నిరూపించారట.ఆరోజుల్లో భార్యని తీసుకు స్భకి వెళ్ళిన ధైర్యశాలి. అట్లూరులో జంతు బలి మాంపించిన అహిన్సామూర్తి,గ్రామాలలో ఒక్కరు కూడా నిశానీదారులు వుండకూడదని చదువు చెప్పిన విద్యావేత్త.మంచి భోజన ప్రియుడు, నిగర్వి.

చేయవలసిన పని చేయచెందు మేలు
మంచికై చేయు పనికి మన్నింప వలయు

కడుపు కట్టుకు మూటగట్టు పిసినిగొట్టు
గవ్వపోయిన పూట బువ్వమాను



తేలు కుట్టినవాని మేలైన పల్లకి
మీదనెక్కించిన బాధ ప ప

No comments: