Pages

Sunday, June 10, 2007

ఎక్కట్లు

ఎక్కట్లు రచన తుమ్మల సీతా రామమూర్తిదండగట్టువాడు తగు తావులకు చేర్చురక రకాల విరుల రాణచూచిఎచట నెట్టి శబ్ద ముచితమో పరికించికవిరచించు పద్య గద్యములను సాహితీ పత్రిక సాహితీ పత్రికను నడపటం ఎలా తటస్తించిందంటే జైల్ నుంచి వచ్చిన తర్వాత విజయవాడలో సాహితీ భాండార్ ప్రెస్ ను స్థాపించాము.ముఖ్య ప్రోత్సాహకులు,నిర్వాహకులు కొల్లిపర సూరయ్యగారు.ఈయన గొప్ప దేశ భక్తుడు.సాహిత్యాభిమాని.విశ్వనాథ బహిరంగ సభలో కూడాచెపుతూండేవారు,''సూరయ్య లేకపోతేసత్యనారాయణ లేక పొయ్యేవాదు,అని అదేమిటండీ అట్లు మాట్లాడుతాడు, అనేవారు సూరయ్యగారు.కలవాడే కాక మనసు కలవాడు.ఈయనా,నేనూ కలసి సాహితిని నిర్వహించాము అయిదేళ్ళు నడిపామేమో!అంతకు పూర్వమే వస్తూ వుండేది సాహితి శివశంకర స్వామి, నోరిమొదలైన వారి నిర్వహణలో.మీరు ప్రెస్ పేట్టారు కనకచక్కగా నిర్వహించ గలరనిమాకిచ్చేసారు,శివశంకరులు.అది నవ్య సాహిత్యానికి మంచి ఆలంబనగా వుండేది.గిడుగు రామ మూర్తి పంతులు గారు నన్ను చూడగానే చాలా సంతోషించే వారు.సాహితిని ఎంతో మెచ్చుకొనేవారు.''ఇదుగో మీసాహితి ఇలావస్తుందో లేదో,ఈమేడమీదనుంచి ఆమేడమీదకి,ఈఇంటినుంచి ఆఇంటికి ఎగిరి పోతుంది.'అనేవారు.ఆరోజుల్లోనే అనుకొంటాను సామాజిక దురన్యయాలపై నిరసనతో''అతడసలుంటే అనేశీర్షిక పేరుతో వ్యాసాలు వ్రాసేవాణ్ణి.ఆరోజుల్లోనే శివలింగం అంటూ కొన్ని పద్యాలు వ్రాసాను.బ్రిటీష్ వారిపై వుండే ఆగ్రహం ఈపద్యాలలో బాగా ప్రతిఫలించింది.అన్నట్లు చలం మొట్టమొదటి కథసాహితిలో నేనే ప్రచురించాను.అంతకుముందాయన కథలెక్కడా ప్రచురితం కాలేదనుకొంటాను.కొన్ని మృదువు తప్పిన వాక్యాలూ,భావాలూ పరిహరించ వలసి వుంటుందని ఆయనకి వ్రాసాను.అందుకు సమ్మతిస్తూ'ఆపని మీరే చేయండి అని అన్నారు.నేనాపని చేసి ప్రచురించాను.ఆకథ చదివి నాపై కోపగించారు శివశంకర శాస్త్రిగారివంటి సాహితీ మిత్రులు,అయ్యదేవర కాలేశ్వర రావువంటి రాజకీయవాదులూ కూడా. స్వర్గీయ కొడాలి అంజనేయులు.

No comments: