Pages

Saturday, July 14, 2007

ప్రాణభిక్ష

ప్రాణభిక్ష

తిరువానుకూర్ రాజా స్వాతి తిరునాళ్ దర్బారులో వడివేలు సంగీత విద్వాంసుడుగా ప్రథమ స్థానం లో వుండేవాడు.ఆయన చేతిలో వయొలిన్ ఎన్ని సొగసులు పోయేదో ,ఎన్నెన్ని గమకాలుగుమ్మరించేదో చెప్పలేము.ఒకసారి వడివేలు ఒక్కడే వేరే వూరికి ప్రయాణమై వెడుతున్నాడు.ఇద్దరు దొంగలు దారికాచి వడివేలును పట్టుకొన్నారు.ఒక్డు దబ్బు దస్కం లాగేసుకొన్నాడు, వేరొకడు వయొలిన్ గుంజుకొన్నాడు.వడివేలు గిజగిజలాడాడు.''అన్ని తీసుకొంటే తీసుకొన్నారుకానీ నా వయొలిన్ మాత్రం నాకిచ్చేయండి.అదినా ప్రాణం అదిలేందేబ్రతకలేను,దయచేసి దాన్ని నాకిచ్చెయ్యండి.''అనిబ్రతిమలాడాడు. దొంగలిద్దరూ సంప్రదించుకొన్నారు. ఈవయొలిన్ వాయించడం మనకి చేతరాదు,దీన్ని మనమేమి చేసుకొంటాము, ఇచ్చేద్దాము. అనినిర్ణయించుకొని వయొలిన్ వడివేలుకు ఇచ్చేసారు. వడివేలు ఆనందం పట్టలేక పోయాడు. సంతోషంతో అక్కడే కూర్చుని వయొలిన్ వాయించడం మొదలెట్టాడు. దొంగలిద్దరూ డబ్బు పంచుకొంటూ ఇతని సంగీతం విని ముగ్ధులయి పొరపాటు చేసాము, మీరు ఎంతబాగా సంగీతం వినిపించారు, అని అతని వస్తువులన్నీ అతనికిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చారు.

No comments: