Pages

Thursday, July 12, 2007

౩౩ సెకండ్లలో ముచ్చటైన సౌందర్యం

33 సెకండ్లలొ ముచ్చటైన సౌందర్యం

జిగేల్ జిగేల్ మనే ఆభరణాలు, చమక్ చమక్ మనే చీరలూనలుగురిలో కొట్ట వచ్చినట్టుగా కనపడాలనే తపన,ఈమధ్య వనితామణుల్లో విపరీతంగా పెరిగింది.ఇక పెల్లికూతుళ్ళ మాట చెప్పాలా?మేకప్ అనేది మన సాంప్రదాయం కాదు, కానీ ఇప్పుడు అదిమన అలంకారంలో ఒక భాగ మయింది.పెళ్ళికూతుళ్ళకేకాదు పెళ్ళికి వెళ్ళిన వారికి కూడా మేకప్ మీద మోజు పెరిగింది. బ్యూటీ పార్లల్ కివెళ్ళాలిసిందే.ఊమా జయకుమార్ అనే ఆమె బెంగలొర్ లొ బ్యూటీ పార్లల్ డిప్లొమా పొంది,పెళ్ళికూతుళ్ళని తయారు చేయడంలో సిధ్ధ హస్తురాలైంది.''ఒన్ మినిట్ ఊమా'అనే పేరు తెచ్చుకొని నాలుగు సంవత్సరాలుగా ''లింకా బుక్'' లొస్థానం నిలబెట్టుకొంది.
33సెకండ్లకి ఒకకొక్కరికి హైర్ స్టెయిల్ తొ సహ 63 మందికి మేకప్ చేసి2008 లింకా బుక్ లొ కూడాస్థానం నిలబెట్టుకొంది.ఇప్పుడు ఆమెనీ'ఫ్యూ సెకండ్స్ ఊమా' అంటున్నారట.
ఏపనైనా సాధించాలంటే నాలుగు ''సీ' లు వుండాలంటుందీమె.1 కాన్సంట్రేషన్,కాంఫిడెన్సె, నొకాంప్రమైజేషన్, నొకంఫ్యూజన్ ,ఈనాలుగూ వుంటే విల్ పవర్తోడు చేసుకొని ఏఎదైనా సాధించగల మంటుందీమె.
సాధనతో ప్రతిభ,ప్రతిభతో ప్రగతి.ఈమె అడుగుజాడల్లో ఎంతో మంది యువతుల్ని నడిపించి,స్వయం పోషకుల్ని చేసింది.ఇలాటి వారందరూ గురువులే. Deccan heralD

No comments: