శ్రీ దాసు శ్రీరాములుగారు రచన టీ. జ్ఞాన ప్రసూన
సరస్వతీదేవి కొందరికి చిన్నతనంలోనే అశీస్సులందించి చేయి పట్టుకొని నడిపించి సారస్వత జగత్తులోకి ప్రవేశం కల్పిస్తుంది. పెద్దవాడయాక మొదలు పెడితే కాలం వౄధా అయిపోతుందనుకొంటుందేమో మరి?లేకపోతే గోలీలాడుకొనే వయస్సులో పిల్లవాని చేతులొ కలం నిలిచిందంటే ఆతల్లి దయ కాక మరేమిటి?
దాసు శ్రీరాములుగారు పన్నెండేళ్ళ వయసులోనే''జయ జయ సోమలింగా 'అనే కీర్తన రచించారట మొదటగా.'సాత్రాజితి విలాసమనే యక్షగానంకూడారచించారట.ఆకిరి పల్లిలో సంస్కౄత విద్య నభ్యసించి,అవధాన విద్య నేర్చి,''అభినవ పండిత రాయా' బిరుదు పొందారట.జటిల సంస్కృత భాషలో 'వేదాచల మహాత్మ్యమూ' కౄష్ణార్జున సమరమూనే రెండు కావ్యాలు రచించారు.''సంవరణోపాఖ్యానము,లక్ష్మణావిలాసము,అనే యక్షగానాలు రచించారు.చదువు చదువుటలో ఒకొక్కరు ఒకొక మార్గము ఎన్నుకొంటారు. వీరు ఏ విషయం చదివి పరీక్షలు వ్రాయాలన్నా ఆవిషయాన్ని ఆకళింపు చేసుకొని పద్యాలలో ముందురచించే వారట. అపుడు ఖంఠస్థం చేసేవారట ఇక మర్చిపోవడం అనే మాటేలేదు..
1 comment:
"శ్రీ దాసు శ్రీరాములుగారు రచన టీ. జ్ఞాన ప్రసూన
సరస్వతీదేవి కొందరికి చిన్నతనంలోనే అశీస్సులందించి చేయి పట్టుకొని నడిపించి సారస్వత జగత్తులోకి ప్రవేశం కల్పిస్తుంది. పెద్దవాడయాక మొదలు పెడితే కాలం వౄధా అయిపోతుందనుకొంటుందేమో మరి?లేకపోతే గోలీలాడుకొనే వయస్సులో పిల్లవాని చేతులొ కలం నిలిచిందంటే ఆతల్లి దయ కాక మరేమిటి?"
ఇలా చెప్పడం బాగా అనిపించింది.
Post a Comment