దశావతారాలు రచన కీ.శే.రావూరువెంకటసత్యనారాయణరావు.
సురులకోరికతీర్ప సొమకునిదౄంప
సాగరంబునజొచ్చ్చి వేదములు తెచ్చి
సుఖముగూర్చినయట్టిమహనీయమూర్తీ మత్స్యావతారా
నగము కవ్వముజేసిన్ ఆగురజ్జువుజేసి
జలధిచిలికెడువేళ వెన్నుపై కవ్వము
వింతగామోసి సురులకెల్లను
సుధనుపంచినధర్మమూర్తి కూర్మావతారా
ధరణినెల్లను చాప చ్గుట్టుగ
చుట్టిఎత్తుకుపొవు దానవు
పట్టీపలమార్చిధరణిబ్రోచిన
వందితావరసేవితా వరాహావతారా
లోకమ్ములను గెలిచిభీకరాకౄతిదాల్చి
పసమించుదానవునిమురుసి మూడడుగులు
దానమునుగోరివటుడౌచు,ఘనుడౌచు
బలినిత్రొక్కినయట్టిరమణీయరూపా
శ్రీవామనావతారా
హరినిగొలిచిననేరమునకై
చిరుతనరమరసేయుతండ్రిని
వురువునందునచేర్చుక పరిమార్చినట్టి
కౄపాసింధో నరసిమ్హావతారా
ధరణిగలట్టిక్షత్రియవారలపైకసిగొని
పరశువుతోదునుమాడి మాతౄచరణములంటిన
పరాక్రంశాలిపరశురామావతారా
ధర్మముకాపాడగ దైత్యులనుదునుమాడగ
తాపసవరులనుబ్రోవగ రావణాదులను
వరియించిమించినమానవరూపధారి శ్రీరామావతారా
మునులకోర్కెలుతీర్ప దోపికలై రమ్మని
సరసములాడుచు సందిట దాచుచు
అనురక్తితో ముక్తిని అందజేసినదేవా
నీలమేఘశ్యామశ్రీకౄష్ణావతారా
కరుణ ఏ లేనట్టికఠిన మానవజాతి
కడగండ్లపాలౌట కళ్ళారజూచి
కరుణతోకరిగిపోయినగుండె కన్నీటిధార
పురికొల్పి తరమగా
ధరనహింసావ్రతముబొధించిమించిన
స్నిగ్ధ ప్రకాశశ్రీబుధ్ధావతారా
నాలుహూధర్మాలు నట్టేటీలోగలువ
బంగారు సంఘము పంచ బంగాళమై
నరలోకమెల్ల నరకప్రాయముగాగ
ధర్మము స్థాపింప దయతోడ వచ్చేటి
కారుణ్యరూప శ్రీ కల్క్యావతారా
నమో నమ;
No comments:
Post a Comment