Pages

Sunday, March 16, 2008

నలభై ఇటుకల మధ్య
ఎంత చక్కటి స్థలాన్నిసౄష్టించావు
ఏకాంతము,నిశ్శబ్దము
స్వచ్చ వాతావరనం
ఎక్కడ కూర్చుంటే
అక్కడే ఋతువులు
గడిపేయాలని వుంది
వాకిట్లో లాంతరుపూలు
ఉల్లాసంగా ఊగినపుడు
ఇంటిలోపల వసారాలొ
మనీ ప్లాంట్ జాలర్లు
ఆకుపచ్చగా వూగుతూ
మొఖానికి తగిలినపుడు
బాత్రూంలో కార్నెర్
బల్లపై తెల్ల ఆవులజత
తలలూపినపుడు
దేవాలయంలోనంది
హాలులో ష్తిమితంగా
నెమరువేస్తున్నపుడు

No comments: