నువ్వు నన్ను రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తా
నువ్వూ నేనూ తోబుట్టువులం
నను నరకకు రా ఓబాబూ!
గొడుగై చల్లని నీదిస్తా
ఫలమై ఆకలి తీరుస్తా
పూవై కంటిని మురిపిస్తా
తావై నాసిక నలరిస్తా
సూర్యుడు నేతా నేనతని దూతా
సూర్యుడు ఇచ్చిన శక్తిని తెచ్చి
మీకిచ్చి మీకెంతో మేలు చేస్తా
నా గాలి పీల్చి నా మేలు మరువకు
నువ్వూ నేనూకలుద్దాం
నింగికి నేలకు నిచ్చెన వేద్దాం
సశ్య శ్యామల శోభిత మైన
నందనవనమును సృష్టిద్దాం
సహకార సహ జీవనములలో
సమ్యమనము సాధిద్దాం
No comments:
Post a Comment