ఉత్తమ దంపతులు,,ఉత్సాహపరులు
కాడిసమముగమోసి సాగుచేసారు
ఆధ్యాత్మికపు పంట పండించినారు
అతిథిపూజలమర్మమెరిగిచాటారు
సంస్కార మనియేటిపూలు పూసాయి
సంతోష మనియేటి కాయల్లు కాచె
కాలగతి నెవ్వరూ కాదనగలేరు
చిన్నరి పార్వతి చిన్నబోయింది
చిటికెనవేలు జారిపోయింది
త్రివిక్రమదేవుడొ తెరమరుగు అయ్యె
సుకృతము,చదువు,వినయము,మర్యాద
పుణికిపుచ్చుకొన్న పార్వతి ధీరయై
కన్నబిడ్డలకంటిపాపవలె సాకె
ఆకంటి పాపలే వెంట నిలిచారు
అరువదేళ్ళ పండుగానందంగ జరిపారు
ఇంకేమికావాలి, ఇంతికీజగతిలో
బిడ్డలే చుక్కాని బ్రతుకు నావకు చూడ
వెయ్యేళ్ళు వర్ధిల్లు,పార్వతీ!పార్వతీ!
వేవేలదీవెనలునీకివే పార్వతీ!
No comments:
Post a Comment