నీకెలా తెలుసు?
చిన్నగా నీలంగా వుండే
అడవిపూలు కిటికీలో
మూలగా పెడితే
నాకిష్టమని నీకెలాతెలుసు?
కిటికీకి ఎదురుగా
నిల్చోగానే నువ్వు
నాకెదురయావు
నీకు తెలియదు నిన్ను
నేనెంత ప్రేమిస్తున్ననో
అందాన్ని ఆరాధించే
పరమ పూజారిని నేను
నీరూప కల్పిత చిత్రాలు
అపుడపుడూ నిద్రలో
నన్ను పలకరిస్తాయి
పిలుస్తాయి,నాతో
సంభాషిస్తాయి
తీవ్ర మైన కోర్కెలోనే
దేవుడున్నాడు
అకుంఠిత కార్య దీక్షలోనే
అనతానందం వుంది
అదేనాకిష్టం,
No comments:
Post a Comment