Pages

Tuesday, October 7, 2008

దసరా

దసరా
పరిచెద పారిజాతములు
పాదములల్లన మోపి రాగదే
తెరచెద గుండె వాకిళులు
తీరుగ గుమ్మము దాటి రాగదే!
పరచెద ఆత్మ పీఠమును
చల్లగా వచ్చి యలన్కరిమ్పవే!
కురిసెద భక్తి గీతములు
కోరిక తీరగ యాలకిమ్పవే!
రావూరు

No comments: