దసరా
ప్రాలేయశిఖరాన పతియునీవును గూడి
సరసమాడెడి వేళ విమలనవ్వు
మన్దాకినీతీర సుందర సీమల
విహరించు వేళల వెల్గునవ్వు
వృషభ వాహనమెక్కి ఊరేగు వేళల
ముక్కంటి కురిపించు మొలకనవ్వు
కుడుముల దేవర బుడిబుడి నడకల
కొంటె చూపుల లోని కొసరునవ్వు
నవ్వులన్నియు దీవన పువ్వులగుచు
కోరిఈవేళ మాయింట కురియవలయు
నివుపతియును సుతుడును నేడు మమ్ము
వరసదివింపగావలె వరములిచ్చి
రావూరు
1 comment:
జ్ఞాన ప్రసూన గారు: దసరా శుభాకంక్షలు.
Post a Comment