ప్రేమ పెంచు, ప్రేమ పంచు!
" మానవులు చేయ వలసిన దేమన భక్తీ విశ్వాసము లనెడు హృదయ దీపమును సరిచేయ
వలెను. ప్రేమయను వత్తిని వెలిగించ వలెను. ఎప్పుడిట్లు చేసెదరో యప్పుడు జ్ఞాన మనే జ్యోతి {ఆత్మ
సాక్షాత్కారము } వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును .ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞాన మెవరికి
అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి యుండదు. కనుక మనకు అవిచ్చిన్నమైన అపరిమిత ప్రేమ యుండ వలెను. ప్రేమను మన మెట్లు పొందగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేని
దగును.ప్రేమ యనునదే లేని ఎడల చదువుట గాని ,వినుట గాని , నేర్చుకొనుట గాని నిష్పలము.
ప్రేమ యనునది వికసించని చొ భక్తీ , నిర్వ్యామోహము ,శాంతి, స్వేచ్చాలు పూర్తిగా నొకటి తరువాత నింకొకటి వచ్చును. దేనిని గూర్చి గానీ మిక్కిలి చింతిం చనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యదార్ధ మైన కాంక్ష ,ఉత్తమ మైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కారించును. అదియే ప్రేమ,అదే మోక్ష మునకు మార్గము.
శ్రీ షిర్డీ సాయిబాబా సూక్తి
No comments:
Post a Comment