రాకోయి నారాజా
రాకోయి నా రాజా నీ రాణి గారు కబురంపే దాకా!
రానన్నాళ్ళూ రాతిరి పగలూ
రాలేదని గుండెలలో గుబులు
వస్తావని విన్నపుడే మొదలు
వచ్చి ఘడియ నిలవోయని దిగులు రా
మల్లెలు మనసో మంకెన సొగసో
ఎది నీ మది కింపగునో తగునో!
అడవి కోన గాలించి వెతికినా
అందమైన పువ్వ మరదు సిగలో! రా
పండు వంటి నా ఒడలికి దీటని
పండునా డీవంపిన చీర
ఎట మరచితినో!ఎట విడిచితినో!
ఏమి తోచ దేటు పాలు పోదపుడే రా
రచన _ కొనకళ్ళ వెంకట రత్నంగారికి కృతజ్ఞత లతో
No comments:
Post a Comment