వెంకన్న బాబు
గోవింద యని పిల్వ కోయందువట నీవు
వాత్సల్య రాశివా వరదరాజ!
ఏడు కొండలవాడ ఎక్కడ నీవన్న
ఎక్కి రమ్మందువా చక్కనయ్య
వడ్డికాసుల వాడ వచ్చు చున్నా నన్న
తొంగి చూచెద వెంత దొడ్డ దొరవో!
ఆపద మ్రొక్కుల అయ్యవా యన్నచొ
కాపాడు తెన్తటి కరుణ య్య !
నిన్ను నమ్మిన వారికి నిజము సుమ్ము
కాపురము వీడి పరుగెత్తు పాపమడుగు
నిన్ను కొలచిన వారికి నిజము సుమ్ము
భవ భయమ్ములు దూరమై పారిపోవు !
1 comment:
పద్యం బాగుంది. కాకుంటే చిన్నలోపాలు...
క్రింది సవరణలు చేస్తే మీ పద్యం సలక్షణమై శోభిస్తుంది.
పిలువ - పిల్వ
ఏడు కొండలవాడా - ఏడు కొండలవాడ
చూచెద వెంట - చూచెద వెంత
అయ్యవా యన్న - అయ్యవా యన్నచో
కాపాడె డెంతటి - కాపాడు టెంతటి
పాపమెల్ల - పాప మడగు.
Post a Comment