Pages

Friday, July 20, 2007

ఆకాంక్ష
రచన
టి. జ్ఞాన ప్రసూన
ఏమౌతానో నేనేమౌతానో
మరలా జన్మిస్తే
దేవాలయం కోనేరులో
తాబేలయి పుడతానో
అలాగయితే
ప్రతిరోజూ సుప్రభాతం
సహస్రనామం శ్రధ్ధగా వింటా

ఆలయం పెరటిలో
పూల చెట్టయి పుడితే
ఒక్కొక్క పువ్వునయి రోజూ
స్వామి పాదల దగ్గర వడిలిపోతా

నాదస్వర విద్వాంసుని
సన్నాయిలాపుడతానో
పర్వ దినాలలొ
స్వామి సన్నిధిలో
మంగళ స్వనాలు వినిపిస్తా

No comments: