Pages

Monday, September 3, 2007

లలితా మాట

లలితమాట
తోటివారితోడమాటమాత్రమునైన
తగవులుకలహాలు,తగదు,తగదు
పోరునష్టమునిచ్చు,పొందులాభమునిచ్చు
లక్ష్యముంచుడయ్యలలితమాట

గొప్ప పేదలనుచు గొడవల పెంచకు
వున్నవారిచూచి వులుకుపడకు
లేనివారిచూచిలేకి చేయవలదు
లక్ష్యముంచుడయ్యలలిత మాట

పదవికొరకూఅశ పడకుము మానవా!
వేరొకరిని దించి వేడ్కపడకు
నిన్ను దించునాడు నీకు తెలియును బాధ
లక్ష్యముంచుడయ్య లలితమాట

చెడేదవువినినీవు చెప్పుడుమాటలు
వినక చెడెదవయ్యవిజ్ఞులాడ
మితిగమాటలాడు,మతితోన పనిచేయి
లక్ష్యముంచుడయ్య లలితమాట

కలలనైఅనగాని తలపునైఅననుగాని
తలచకుచెడుచెడునుకలతలమది
మంచినిమదినెంచి మంచిని పెంచుము
లక్ష్యముంచుడయ్య లలితమాటలలితమాట

No comments: