Pages

Friday, September 7, 2007

పప్పు అంటే కందిపప్పు

పప్పు అంటే పప్పు కందిపప్పు '
కందిపప్పు ఎవరు కనిపెట్టారో కానీ మహకమ్మగా వుంటుంది.కందిపప్పుతో భొజనం చేస్తే బలవర్ధకంగా వుంటుంది.బ్రాహ్మలుకందిపప్పు తింటారు, అనే వాక్యం తిరగబడి,పప్పుబ్రాహ్మలు అనే విసురు విసిరిబ్రాహ్మలనెత్తికెక్కి కూర్చుంది కందిపప్పు.బ్రాహ్మలకి సుద్దపప్పులేకపోతే ముద్దదిగదు,సుద్దపప్పుతినినిద్దరోతారూనికూడావింటూవుంటాము.కందిపప్పుని సన్నటి సెగన వేగించాలి,పప్పూంతా ఒకేరకంగా వేగాలి,అలావేగించడమలా వేగించడం మాచంద్రకళకి బాగావచ్చు. అలావేగించిన కందిపప్పునికూడా సన్నటిసెగ పైనే ఉడికించాలి.పూర్వం పప్పుగిన్నెలని వుండేవి.వాటినే గుండుగిన్నెలని అనేవారు.ఇత్తడి,కంచుతో తయారుచేసేవారు.బొగ్గులకుంపటిమీద ఆపాత్రలతో పప్పూదికిస్తే కమంటివాసన గృహమంతా పచార్లు చేసేది.పూసలు,పూసలుగా వుండేఇంటినేయి వేసుకుపప్పూన్నం తింటేతరవాతి పదార్ధాలన్నిటికి రెండో నెంబరే.
'ఎలాగయినా కందిపప్పుమహా కలివిడి అయినది.ఏకూరతో నయినా కలిసిపోతుంది.
అన్నిటితోకలిసిపోతుంది,అన్నిటినికలుపుకొంటుంది,తనరుచి వాటికిస్తుంది.కాని వాటిరుచినీసింటాపెట్టి వుంచుతుంది.కందిపప్పుఒక్కటీ పచ్చ్డి చేసామనుకోండితనరుచి తనదే.వుల్లిపాయపులుసుబెల్లంవేసివండి రెండూ జోడించి తింటేప్లేటుకి, మూతికి చేయి గుర్రంలా పరుగెత్తాలిసిందే!
కందిపప్పుతో పప్పుచారు,పప్పుపులుసు పెడితేఘుమఘుమ.సాయంత్రంభొజనానికి పప్పుచారూ ఒక వేపుడుకూరా వుంటే ఫైవుస్టార్ భొజనం దానిముందు దిగ దుడుపే.పెళ్ళి కావలసిన యువతీయువకుల్ని, వారితలితండ్రులనీసౌమ్యంగా,హాస్యంగా''పప్పన్నం ఎప్పుడుపెడతారూనీడుగుతారు.పూర్వమలా అడిగితే ముసిముసినవ్వులు నవ్వేవారు,ఇప్పుడు పప్పన్నం ఎంతకావాలంటే అంత పెట్ట్స్తాగాని పెళ్ళిచేసుకోమనకండి అంటున్నారు.పెళ్ళిపప్పన్నం రూపుమారిపోయింది.పప్పులు దప్పళాలుపోయి మిరపకాయ బజ్జీలు,నాన్లు,చాట్లుచోటుచేసుకొంటున్నాయి.కందిపప్పు తిరగలిలో విసిరిపొట్టు తీయకుండావండితే ఇంకాబలం.అలాటిపప్పు వుడుకుతుండగాపైన తేటనీరు వంచిచిటికెడు వుప్పువేసి,నాలుగు జీలకర్ర పోచలు నేతితో తిరగమూత పెట్టీఅతేట త్రాగితే వస్తాదులవుతారు.ఈతేటని కట్టు ంటారు,ఇదిబాలెంతలకు,బలహీనులకి,చంటి పిల్లలకి సంజీవని వంటిది.తెలుగాయన ఒకాయన చెఫ్గా అమెరికావెళ్ళారు.పెద్దవిందు.భోజనం ముందు సూప్ తాగడం ఆంగ్లేయులకి అలవాటుకదా!ఈయన సూప్లాగా కందికట్తు వేడిగా కతోరీలలోపోసి అందించారట.ఏమిరుచి1ఆయన ఆవిందులో మూడుసార్లు కందికట్టు చేయాల్సి వచ్చిందిట.కొందరు మహానుభావులుంటారండీ!ఎక్కడికెళ్ళినామన 'తిండీ మన 'భాషా'మన కట్టూ'మనా'బొట్టూ'ప్రచారం చేస్తారు.కందిపప్పుతోఇంకో పదార్ధం కందిపొడి చేస్తారు.పూర్వం పెళ్ళిళ్ళు కుదిరితేవూరిలో అమ్మలక్కలంతా చేరీప్పడాలు,వడియాలు,కందిపొడి,గోంగూర,అరిసెలు,మినపసున్ని వుండలు, లడ్డూలునెలముందే భారీగా తయారు చేసే వారు.ఉత్త కందిపప్పు వేగించి కందిపొడిచేస్తారు, కొందరు కందిపప్పు,శెనగపప్పు, పెసర పప్పు విడి విడిగా వేయించికందిపొడిచేస్తారు.గ్రైండెర్లో వేసినా కొంచేం గరగర చేస్తారు.దీన్ని అన్నంలో కలుపుకొని పురిశెడనెయ్యో, నూనో వేసుకొని తింటారు.దీనికికూడా వుల్లిపాయపులుసు చెలికత్తెకందిపప్పుతో అరవమామీలు సాంబారుగొప్పగా పెడ్తారు.పసిపిల్లలకి వుసిరికాయంత పప్పు వేసి అంతేనెయ్యి వేసి అన్నంపెడతారు.అలా చిన్నప్పుడేకందిపప్పు నేస్తం అయిపోతుంది.అప్పుచేసయినా పప్పుకూడు తినాలి.

1 comment:

చిన్నమయ్య said...

వేటురి ప్రభాకర శాస్త్రి గారు రాసిన "ఆంధ్ర కల్పవృక్షము" అనే పాఠం ఒకటి తాటి చెట్టు గురించి చిన్నప్పుడు బళ్లో చదివిన జ్ఞాపకం.

కంది పప్పు కూడా తెలుగు వారికి ప్రాణ ప్రదమయినదే మరి. నా, మట్టుకు నాకు, కూరా, చారూ లేకపోయినా పర్వాలేదు. పప్పూ, ఓ ఆవకాయ బద్దా, ఓ రెండు గుమ్మడొడియాలూ - చాలు. నెయ్యి, అన్య కారణాల వల్ల తగ్గించేను లెండి.

మీ వ్యాసం రుచికరంగా వుంది.