Pages

Tuesday, April 8, 2008

సర్వధారి ఊగాది
సముద్రాలకవతల
సముద్రాలకివతల
ఒకేసారి వసంతం
ఒకేసారి పులకరింత
కాలందారపు
బంతిలాంటిది
బంతి మనేదుటే
కానీ దానికొస
కనిపించని
అదృశ్య హస్తంలో
కదుల్తూవుంటుంది
రుతుచక్రాలకి
పరధ్యాన్నంలేదు
మరుపులేదు
మానవుడికోఅసం
హెచ్చరికలు చేస్తూ
వేపపువ్వుకొత్తది
మామిడికాయ
వగరుపిందె
బెల్లం కూడా
ఇప్పుడేతయారయింది
చెరుకుగడ
పొలమ్నుంచి
పీకితెచ్చారు
చింతపండు
జివ్వుమంటూంది
అరటిపండు పండి
అయిదునిముషాలే అయింది
అంటూవూరిస్తూనే
కాలపురుషుడు
పక్కకు తిరిగి ఓఅరగా

నవ్వుకొంటాడు

'వీళ్ళకి వీళ్ళవయసు
నేచెప్తేగానీ తెలియదూ'
అందుకే
ఏటికేడాది ఊగాది
తీయని స్మృతుల ''గాదీ'
టి.జ్ఞాన ప్రసూన

3 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఏమీ అనుకోవద్దు. మీరు సీనియర్ సిటిజెన్ లా ఉన్నారు. కాని ఈ వయసులో బ్లాగింగులాంటి తాజా ప్రక్రియ చేపట్టారు. అదెలా ఉన్నా మీలాగా యవకవులు కూడా రాయలేరనిపిస్తోంది. దయచేసి కొనసాగించండి. ఇలాగే మాకు మార్గదర్శనం చెయ్యగలరు.

సుజాత వేల్పూరి said...

ప్రసూన గారు,

ఉగాదికి శుభోదయం మంచి కవిత్వంతో పలికినందుకు ఆనందంగా ఉంది. పంచమ స్వరంతో ప్రౌఢ కోకిల పాడినట్టుంది.

రాధిక said...

అద్భుతం గా వుందండి మీ స్వాగత గీతం.

అరటిపండు వేసి పచ్చడి చేసి పెడితే ఇక్కడి వాళ్ళందరూ నవ్వారు ఇదేమి పచ్చడని.కొంత బాధపడ్డాను.మీ కవితలో అరటిపండు చూసాకా కాస్త ప్రశాంతం గా వుంది.:)