సాహితీ ప్రపంచంలోని సహృదయులకు స్వాగతం,సుస్వాగతం
తెల్లవారిలేస్తే ఎన్నో భావాలుమనసులో మొలకెత్తుతూవుంటాయి.
ఈవిద్యుచ్చక్తి పలక మీద వ్రాస్తేనలుగురు పంచుకొంటారని
ఆశ. మీకు బాగున్నవనిపించే వాటిని గురించి మెచ్చుకోలుగా
నాలుగు మాటలు వ్రాస్తే ఉబ్బి తబ్బిబ్బయిపొతాం.గేయాలు,వ్యాసాలు,
,భక్తి,సూక్తి,కధలు,హాస్యొక్తులు అన్నివుంటాయి.కళ లేని మనిషిలేడు .
కని తమలోనూ కళ వుందని తెలుసుకొనేచైతన్యం కావాలి.ఆచైతన్యము
సాహిత్యము అందించాలి.గురువుగా,తల్లిగా,అధినేతగా,స్నేహంగా,పలకరిస్తూ,
ఓదారుస్తూ,ఉత్సాహ పరుస్తూ, చేతి కర్రలా ఊతనిస్తూ,ముందుకు తీసుకు వెళ్ళాలి.
మంచి భష వ్రాయడం,మంచిభాషచదవడం,మంచ్చిభాష
మాత్లాడడంతెలుగువారి కర్తవ్యంగా ముందుకు సాగుదాం రండి,రండి
టీ.జ్ఞానప్రసున
1 comment:
విద్యుచ్చక్తి పలక .. ఆహా .. ఎంత హాయిగా ఉంది చదవటానికి.. బాగుంది పదాల అమరిక ..
తెలుగు భాషామతల్లి హృదయము పరవశించేలా మీరు చేస్తున్న ఈ బ్లాగు ప్రయత్నము అభినందనీయము.
Post a Comment