Pages

Tuesday, April 29, 2008

మార్పు
ఉన్నత స్థితిని పొందలేము
ఉన్నస్థితిని బాగుచేసుకోలేము
అహంకారాన్ని అణచుకోఅలేము
కోఅరికల్ని కాలదన్నలేము

తృప్తి అనిపించే ఐహికసుఖాలలో
అసంతృప్తి ఏదో ఒకనాడు పైకివుబికి
నస్వర ప్రపంచపు తళుకుల్నుంచి
నన్నుతీసుకుపోఅవాలి

ఓఅపరమ గురువుల పాద సన్నిధికి
అప్పుడు బడలిన పువ్వుల
గురువులపాదాలకి అతుక్కుపోఅతుంది
నా అలసి సొలసిన మనస్సు
టి.జ్ఞాన ప్రసూన

No comments: