Pages

Saturday, April 12, 2008

అలవాట్లు

మప్పగలంకానీ మార్చలేము అలవాట్లు
ఏదైనా పని చెయ్యండి అంటే ''ఎప్పుడూచెయ్యలేదండీ అలవాటులేదు అంటారు.
క్రియాశూన్యుడుగా ఎవరూ బతకలేరు.క్రియ అంటే పని, కాళ్ళూచేతులూ వున్నాక ఏదో పని చేస్తూనే
వుండాలి.ఒకేపని క్రమం తప్పకుండా చేస్తూ వుంటే అలవాటయిపోతుంది.
పనులు కొన్ని అవసరమయినవి,కొన్ని అందరూహర్షించేవి, కొన్నిచేయక తప్పనివి,
కొన్ని చేయకపోతే తోచనివి ,ఇలా ఎన్నోరకాలైన పనులున్నాయి.కొన్నిచేస్తే
నష్టం కలిగించేవి, కొన్ని జీవితాల్ని అధపాతాళానికి తొక్కి వేసేవి,కొన్ని
సతీ సక్కుబాయిలాగా చివరిక్షణం దాకా వదలనివి,ఇవొకరకాలు.రెండో రకం వాటిని
అదే పనిగా సంధ్యావందనం చేసినంత నిష్టగా ముప్పొద్దులా చేస్తూంటే
అవే అలవాటయి, దురలవాటయి, మెడకి నాగ పాశంలా చుట్టుకొంటాయి.ఇలాటివి
ఎవరు చేస్తున్నా వాటిని చెయ్యకండీ అని చెప్పకుండాఏ నోఅరూ వూరుకోఅదు.
చిత్రం ఏమిటంటే దురలవాట్ల లాగానే ఒకప్పుడు మంచి అలవాట్లుకూడాబాధిస్తాయి.
ఇంకోఅ తమాషా ఏమిటంటే ఒకప్పుడు మంచి అలవాట్లు ఎల్లకాలం వాటివిలువ నిలబెట్టుకోఅలేవు.
కాలం మారిపోఅయాక ఈతేడా బాగా కనిపిస్తోఅంది.నిద్ర లేవంగానే మొఖంకడుక్కోఅవడం
ఒకమంచి అలవాటు. పళ్ళుతోఅముకొకుండాఎవరితోఅనూ మాట్లాదవద్దు, అనేదిబామ్మ.స్నానం చేసి సూటొ బూటు వేసికొని, బాగ్ పుచ్చుకొన్నాడు మనవడు. అదేమిట్రా!మొహం కదుక్కొకుండా ఏమీతినకుండా,పచ్చి మంచినీళ్ళైనాతాగకుండ్
ఆ అలాపరుగెడుతున్నావు?అంటేబ్రేక్ ఫాష్ట్ తినేటప్పుడు ఆక్క్డే మొఖం గిఖమన్నాడు.బాత్రూంఖాళీగాదొరికిందని స్నానానికి వెళ్ళాట్ట,వచ్చేసరికి టైమె అయిపోఅయింది.కాంత దాసులు,కనకదాసులులాగా ఇప్పుడూందరూ ''సమయ
దాసులూ'అయిపోఅయారు. లేవగానే పక్క దులిపి దిళ్ళుసరిచేసి మరోఅ పనిచేసుకోఅవాలి.అలా వదిలేసి వెళ్ళిపోఅతున్నావేమే అని మనుమరాల్ని నిలదీస్తే ''మళ్ళీ రాత్రికి పడుకునేదేగా''అని తలేగరేసి వెళ్ళిపోఅయింది
తక్కింది తరవాత మాట్లాడుకొందాం.

1 comment:

Dr. Ram$ said...

బాగుందండి..బాగా చెప్పారు.. కాని నాది ఒక చిన్న ధర్మ సందేహం.. ఈ పని ఇప్పుడే చెయాలి..యిది తరువాత చేయాలి, అల యే పని ఎప్పుడు చేయాలో ఎదైనా శాసనం వుందా?? యిది అంతా కేవలం అనుకరణ..కాకపోతే ఆ అనుకరించేది కూడా మన వాళ్ళు , వాళ్ళ వాళ్ళ అభిరుచులుకి అనుగుణము గానే అనుకరిస్తున్నారు..అని నేను అనుకుంటున్నాను..ముందు నేను , నా అవసరాలు, కంఫర్ట్ ముఖ్యం అయ్యాయి..అందుకే జీవితం యాంత్రికం అయ్యింది..