Pages

Wednesday, May 14, 2008

మిస్టిక్ అక్వేరియం

2వ పేజి మిస్టిక్ అక్వేరియం

తరువాత చాలెంజి అఫ్ ది డీప్ కి వెళ్ళాము.అది చిన్న ధియేటర్ కానీ
స్క్రీన్ పెద్దదేవుంది.డీప్ సీ ధియేటర్ లో 20 సీట్లు మాత్రమే వుంటాయి.
లెఖ్ఖ పెట్టి లోపలకి పంపిస్తారు.''అమ్మా!లైటెలుతీసేస్తారు,జలచరాలు
మొఖమ్మీదకు దూసుకు వస్తాయి, కూర్చున్న సీట్లు గడగడా కదులుతాయి
కుర్చీకి రెండుపక్కలా వున్న రింగులను పట్టుకు కూర్చోవాలి.కొంచెం భయం
వేస్తుందేమొ నీకూ'అన్నాదు. అయితే మీరు వెళ్ళిరండిరా!అన్న.''అహవూరికే
చెబుతున్నాఫరవాలేదులే,భయంవేస్తే స్క్రీన్ చూడకు, నే పక్కనే వున్నాగా!
పట్టుకొంటాలే''అని తీసుకెళ్ళాడు. లోపల ఈజీ చైర్ల వంటి కుర్చీలున్నాయి.
పక్డ్ బందీగా రింగులు పట్టుకు కూర్చున్నాము. పైకప్పు అంతా ఆకాశంలాగా
తారలతో నిండిపోయింది. ఎదురుకుండా స్క్రీంపై సముద్రము మనము సముద్రపులోతులకి
వెల్లిపోతూవుంటాము.కుర్చీలు దబదబమని శబ్దం చేస్తూ వుంటాయి,జలచరాలు
భీకరంగా మీదకి దూసుకు వస్తాయి.ఈషో పదినిముషాలు వుంటుంది.కుర్చీలు
వూగినప్పుదు పిల్లలు పొలోమని అరచి గోలచెస్తారు.ఇది చూడటానికి వెరె
కళ్ళజోళ్ళు ఇస్తారు,షోఅయాక వాళ్ళకి ఇచ్చెయ్యాలి.
''రే టచ్ పూళ్' కి వెళ్ళాము. రే అంటె టేకిచేప.
ఈజలచరం బూడిదరంగులో నలచదరంగా వుంటుంది. ఒకకోఅణానికి మూతి,
ఎదురు కోఅణానికిచిన్న తోకవుంటాయి.తక్కిన రెండు కోణాలతో టపటప కొడుతూనీళ్ళలో
ఈదుతూవుంటుంది.నీళ్ళుమనచేతికి అందుతూవుంటాయి. చేయిలోపల పెడితే అవిపైకి
వచ్చి ముట్టుకొంటాయన్నారు. నీళ్ళు చల్లగానేవున్నాయి,అయినాపెట్టాము, చాలా
సేపటిదాకా రాలేదు,చివరికి ఒకసారి తగిలింది.వాతికి తిండిపెట్టడానికి
మనంసరదాపడితె దబ్బు ఎక్కువ కట్టితే ఆదివారం, బుధవారం అనుమతిస్తారట.
అక్కడ స్టెల్లర్ సముద్ర సిమ్హాలున్నాయి.వీటిని ప్రపంచంలో
అయిదు చోట్ల మాత్రమే చూడగలమట.ఇది 1700పౌన్ల బరువున్నది.
అన్నిటికంటే ఆహ్లాద మైనది,''బర్డ్స్ అఫ్ ది అవుట్ బాక్''.మనం
టికెట్ కొనుక్కొనేటప్పుడు రెండు కాయిన్స్ తీసుకోవాలి. అందులో ఒకటి ప్రవేశరుసుము,
రెండవది,పక్షులకి తిందికోసం.అవి ఎంట్రన్సె దగ్గిర ఇస్తే పక్షులకి ఆహారం
ఇస్తారు. అయిస్ క్రీం తో చెక్క స్పూన్ లాటిది ఇస్తారె అలాటి చెక్కకి ఒకవేపు
చిన్న గింజల గుత్తిని ఘట్టిగా అతికించి ఇస్తారు.జూలో లాగా కటకటాల గది.
అటూ ఇటూ రెండు ద్వారా లున్నాయి. గది చుట్టూ పసుపు పచ్చనిప్లాస్టిక్ రిబ్బన్లు
వ్రెలాడదీసారు.లోపల ఎన్నోరకాల పక్షులు.వాటికి కూర్చోడానికి చెట్లకొమ్మలు
పెట్టారు.బెసిన్లాటి పాత్రలో మెత్తటి పీచుపెట్టి వ్రేలాడదీసారు.పసుపు పచ్చ్నివి,
నారింజ రంగువి,ఆకుపచ్చని చిలకల వంటివి తీల్లనివి,బూడిదరంగువి,బుజ్జి బుజ్జి
పక్షులు-మెత్తటి రెక్కలతో,చిన్ని ముక్కులతో-సన్నటికాళ్ళతోవున్నాయి. కల కలారవాలు
చెస్తున్నాయి.మనం పట్టూకెళ్ళిన గింజల హుత్తి వాటికి చూపిస్తే మనదహ్హర కొచ్చి
మనచేతిమీద కూర్చుని తింటాయి.ఒకేసారి రెండు మూడుకూడా వచ్చి కూర్చుని తింటాయి.
అదొక చక్కతి అనుభూతి.అక్కడె ఎక్కువ సేపు గడిపాము. బయటికి వచ్చాక గానీ ఆకలి,
తిమె గుర్తుకురాలేదు.
చలా చూడలేక పోయాము.అప్పటికే ఆరుఘంటలయింది.
ఇటువంటి వాటిని ప్రారంభించడమేకాక శ్రధ్ధగా కాపాడాలి.వీతి ద్వారా డబ్బు
సంపాదించితేనే వీటిని రక్షించుకోగలరు.''ఈ జలచరాల్ని దూరమ్నుంచి ఎందుకు చూస్తారు?
దగ్గరికి వచ్చి,ముట్టుకొని చిత్రమైన అనుభూతిని పొందండీ'అంటారు.దానికి వెరే రుసుము
చెల్లించాలి. సముద్రంలో దొరికే ఆలిచిప్పలరో, గుల్లలతో వస్తువులు చేసి అమ్ముతున్నారు.
టీషర్టులు అమ్ముతున్నారు వాళ్ళ ఎంబ్లంతో . పిల్లలపుట్టినరోజులు చెసుకోవచ్చ్చు.కెకులువాల్లు
తయారుచెస్తారు. ఇవాళ కొన్న టికెట్ పై ముద్ర వేయించుకొని రేపు వెళ్ళి ఫ్రీగా ప్రవేసించవచ్చు.
మనవళ్ళతో వస్తే బామ్మలకి, తాతయ్యలకిఫ్రీ.ఫస్టయిడ్,సెక్యూరిటీ, నడవలేనివారికి
వ్హీల్ చైర్ సౌకర్యాలున్నాయి. మెంబెర్ షిప్ తీసుకొంటే ఇంకా రాయితీలు.ఇలాటి వాటిని
చూస్తోంటె నీటిని,పక్షుల్ని,వాతావరణాన్ని రక్షించాలనే సందేశం వినిపిస్తుంది.
టీ.జ్ఞానప్రసూన .

No comments: