Pages

Wednesday, May 14, 2008

మిస్టిక్ అక్వేరియం

మిస్టిక్ అక్వేరియం
పిల్లలదగ్గరికి U.S వస్తేఎన్నినెలలు వున్నా ఎన్నినెలలేమిటి
లెండి,ఆరునెలలేగా వుండనిచ్చేది?ఆనెలలలొ శని ఆదివారాలే
లెఖ్ఖ కట్టుకోవాలి.మిగతా రొజుల్లో వాళ్ళకిఒక్క క్షణం
తీరిక వుందదు కనక.ఆరెండురోజులే మనం వాళ్ళతో ఎక్కడి
కన్నా వెళ్ళగలం.మొన్న వీక్ ఎండ్ కి నెను,వేదు,ఆను, వేదు
స్నేహితుడు ఫూర్ణ ,అతనిభార్య ఉదయ కలసి ''misTicaquarium''
చూడటానికి వెళ్ళాము.connecTicuTనుంచి misTic వెళ్ళాలంటె
వాతావరణం బాగుంటె ఘంటన్నర పడుతుంది.spring వచ్చింది
కనక ప్రకృతి అంతాఅకుపచ్చ చీర కట్టుకొంది.ఆకుపచ్చలో
ఎన్నిరకాలుంటాయో అన్ని అచీరలో కనపడుతున్నాయి.12 ఘంటలకి
బయలుదేరాము.దారిలో చక్కటి చెరువు కనిపించింది.చుట్టూ చెట్లు
గోడకట్టినట్లున్నాయి,ఈఒడ్డున నుంచుంటే మనము,చెరువు, చెట్లు తప్ప
ప్రపంచమే లేనట్లుగా వుంది. అక్కడదిగి ఫొటోలు తీసారు. నీళ్ళు
ముట్టుకోవాలంటే మత్రం ధైర్యం చాలలేదు.
ముందుగా ఇండోర్ ఎగ్జిబిషన్ చూసాము.ప్రపంచలొ
వున్న అన్ని రకాల చేపలని అద్దాలకేసులలో పెట్టారు.గుల్లలు,షెల్స్
అన్ని ప్రదర్శించారు. కొన్ని చేపలుబంగారు రంగులో,కొన్నినారింజ రంగులో,
కొన్ని నల్లగా తెల్ల గీతలతో కొన్ని బూదిదరంగు శరీరంపై వెండిరజను
అద్దినట్లున్నాయి.వాటికోసం ఏర్పరచిన చిన్ని నీటి ప్రపంచంలో వేగంగా
అటూ,ఇటూ ఈదుతున్నాయి.కొన్ని చేపలకి బారెడు,బారెడు తెల్లని మీసాలున్నాయి.
కొన్నిటి తెల్లతి శరీరంపై నారింజరంగుచారలతో ,వంటినిండా పొడుగాతి
తీగలతో ఆకర్షణీయగా వున్నాయి.ఆతీగల్తో వంటిని కప్పుకొని ఒకసారి,
విప్పుకొని తూనీగల్లాఒకసారి ఈదుతున్నాయి.కానీ అవి విషపు చేపలట.
ఇంకొక చేపలు శరీరాన్ని ''పారాచూట్ 'లాగా విప్పుకొంటూ,ముడుచుకొంటూ
నీటిలో ఈదుతున్నాయి.అతిచిన్న చేపలుకొట్టొచ్చినట్లుండే రంగులతోఅటూ,ఇటూ
హడావుడిగా పరుగెత్తుతూంటేసరదాగా వుంది.ఒక చేపముఖం,కళ్ళూ చింపాంజీ
ముఖంలా అనిపించింది.కొన్ని చేపలు ముందుకు వెనక్కి చూస్తున్నట్లుగా కళ్ళు
తిపూతున్నాయి.విద్యార్ధులకి ఇక్కడ ఎన్నో వివరాలు లభ్యమవుతాయి.పీతలు,
మండ్రగబ్బలు అద్దంలోంచి కుడ్తాయెమో అనంట్లున్నాయి.''పిరానా'అనే ఒకరకం చేప
అందితే చాలు మనిషిని కొరుక్కుతింటుందట.
'' బెలుగా'' అనే తిమింగలాలు వున్నాయి అర్క్ టిక్
కొస్ట్ వాతి పుట్టిల్లు.తెల్లగా వుంటాయి.దూదిపింజలా, పాలలా,ధర్మాకోల్
లావుంటాయి.చెత్తివెస్తే జారిపొయేటట్లు.మీత్తగా లావుగా,బొండాంలా వుంటాయి.
వాటికోసం నీలిరంగు నీళ్ళతో ఒక చెరువులాటిది ఏర్పరచారు.దానిచుట్టూ
గాజుతో గోడలాగా కట్టారు.ఆగోడదగ్గర నిలబడి మనం వాటిని చూడాలి.
అనీలపునీళ్ళు సముద్రం లాగానె అనిపిస్తాయి. వాటిలో ఈతెల్ల తిమింగలాలు
వలయాకారంగా ఈదుతూ వుంతాయి. గాజు గోడ దగ్గరికి వచ్చినపుదు
బాగా కంపిస్తాయి.చిన్నకళ్ళు, వంటీఅకారానికి ఏమాత్రం పోలిక లేకుండా
చిన్న చేతులు,చిన్నతొక.నోరు పెద్దది.ఈనీటి చెరువులో మధ్యమధ్య
పెద్దరాళ్ళు ద్వీపాలలాగా అమర్చారు.సముద్రంలొ చెట్లలా గుబురుల్లా
పెరిగే షెల్స్ పెట్టారు. వాటిని అక్కడి ఉద్యోగులు నీళ్ళల్లోకి దిగి బ్రష్
లతో రుద్ది శుభ్రం చేస్తారు. వీటికి చేపలే ఆహారమట.
పెంగ్విన్స్ వున్నాయి. వాటిని చూడగానే
పెంగ్విన్ బుక్ పబ్లిషర్స్ గుర్తుకువచ్చారు.మెరైన్ థియేటర్ కి వెళ్ళాము.
అక్కడా ఒక కృత్రిమ మైన చెరువు ఏర్పరచారు. అందులో మధ్య ఒక
చెక్కపలక లాటిది పెట్టారు. లైట్లు అమర్చారు. కూర్చునెందుకు అంచెలు
అంచెలుగా బెంచీలు వేసారు.అక్కడ 4 నీతి సిం హాలు వున్నాయి.చెక్క
రంగులో వక్కరంగులో వున్నాయి.వళ్ళు రబ్బరులా వుంటుంది.చెతికి
అరచేతిలో అతుక్కున్నట్లుగా వేళ్ళు అతుక్కొని వుంటాయి. అతిచిన్న తోక.
నేలమీద వెళ్ళాలంటే పొట్టతోఅనె దేకుతూ పోఅతుంది.నీళ్ళలోఈదుతుంది.
వీటికి చేపలే ఆహారం. కొడిక దీని పేరు.1700 పౌన్ల బరువు వుంటుంది.
వీటిని ప్రపంచంలో అయిదుచోట్ల మాత్రమే చూడగలమౌ. సర్కస్ మెనెజర్
లా ఒకావిడ వెతికి చిన్న చేపలు తిండానికి ఎగుర వేస్తుంది.
అవి గాలిలోకి నోరువిప్పి,మెడేత్తి ఆచాపలని ఒడుపుగా పట్టుకొని మింగుతాయి
షో అయేదాకా ఆవిద అలా చేపలు అందిస్తూనే వుంటుంది. నీచెయ్యిఏది? అంటే
చూపిస్తాయి. వెళ్ళి బల్లచెక్క మీద కూర్చో అంటే కూర్చుంటాయి.నీటి చుట్టూ
కటకటాలు కట్టారు. వాటికి చిన్న గేట్లు వున్నాయి.ఇద్దరు స్త్రీలువచ్చి ఆగేటు
ఒకరుతెరుస్తారు. ఇవి బయటికి వచ్చి ప్రేక్షకుల ముందునుంచి దేకుతూరెండోఅ
గేటు దగ్గరికి వచ్చేసరికి రెండోఆవిడ ఆగెటు తెరుస్తుంది,లోపలికి వెళ్ళి
నీల్ల్ళ్ళల్లోకి జారుకొంటాయి. ఆ స్త్రీలిద్దరూ వెళ్ళిపోతారు. జంతువులను తెచ్చి
ఇక్కడ పెట్టి వాటికి మనభాషలో ఆజ్ఞాపించి ఫీట్స్ చేయించడం ఎంత
శ్రమపడితేఅయేపని?

No comments: