Pages

Saturday, May 17, 2008

అనుకొంటూనేవున్నా పేజీ 2

సమయానికి తన దగ్గిర డబ్బులు అయిపోతె వచ్చి అడగలేదని వుక్రోషంవచ్చి
''ఏరా!అసలునువ్వేమనుకొంటున్నావురా?మనిద్దరము ఫ్రెండ్సా కాదా? నీకు అవసరమైనప్పుడు
సర్దలేని దౌర్భాగ్యుణ్ణి అనుకొంటున్నావా?నేను స్వార్ధ పరుణ్ణి అనుకొంటున్నావా?''నేనేమీ
అనుకోడంలేదురా!నేనేమీ అనుకోనిదాన్ని,ఏదోఅనుకొన్నాననుకొని, అనుకొన్నదేమిటో చెప్పమంటే,
నేనెమనుకోవాలిరా?
''నీకూనాకూమధ్య ఆమాత్రం అండెర్స్టాండింగ్ లేదనుకొంటున్నావా?
''అదికాదురా!నిన్న పుస్తకాల షాపుకి వెళ్ళాను.అక్కడొక మంచి పుస్తకం కనిపించింది
కొందామంటే కుబేరుడు మన ఇల్లు [పర్సు] ఖాళీచేసాడు.నీదగ్గరికి వచ్చా, నువ్వు
కె.కె [కుంభ కర్ణుడు]తమ్ముడిలా నిద్రపోతున్నావు.నీపెట్టేఅంతా కెలికి వున్న ధనం
పట్టుకొచ్చి పుస్తకంకొన్నా.ఇప్పుడేమనుకొంటున్నానంటే ఇద్దరిదగ్గరా భత్యం అయిపోయింది
ఏశ్రీమంతుడికొంపకి[పర్సు]కన్నం పెడ్దామంటాడో వీడు?అనుకొంటున్నా.సరెనా?''
''హమ్మయ్య. ఇప్పుడునేననుకొంటున్నా నువ్వే నా''జిగరీ దోస్తువని. ''అనిచల్లబడ్డాడు.

No comments: