Pages

Monday, May 5, 2008

శ్రీ శంకరాచార్య

శ్రీఆదిశంకరాచార్య
గురుబ్రహ్మగురుర్విష్ణుగురుదెవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఈశ్లోకము చదివినా విన్నా శ్రీశంకరాచార్యులవారు
కళ్ళముందు నిలబడతారు.భారత దేశములో గురుపరంపర అనాది కాలంగా
వస్తున్నది.దీనికి మూల పురుషుడు పరమ శివుడు.ఆయన శిష్యుడు విష్ణువు,
విష్ణువు శిష్యుడు బ్రహ్మాయనకి వశిష్టుడు,,శక్తి,పరాశరుడు,వ్యాసుడు,శుక్రుడు,
గౌడపాదుడు,గోవింద భగవత్పాదులు,శ్రీ శంకర భగవత్పాదులుఇలా పరంపర
సాగుతూనెవుంది.శిష్యులను చేరదీసి, ఆదరించి,విద్యాదానంచేసి,నియమ
నిష్టలతో, సత్ప్రవర్తనతో గృహాన్నే గురుకులం చేసి ధన్యులయినగురువు లెందరో
మనకు చరిత్రలో,పురాణాలలో గోచైస్తారు.శ్రీశంకర భగవ్త్పాదులు కాలడిలో
జన్మించిన కారణ పురుషులు.సస్వతీ దేవి కటాక్ష వీక్షణాలతో వర తేజస్సుపొంది
సహస్ర కమలంలా వికసించిన ముఖ బింబమ్నుంచి వెల్లి విరిసి నిరంతరం ఆసేతు
హిమాచలాలను పునీతం చెసాయి.
యోగి అని చెప్పనక్కర లేదు,కవి అని చెప్పనక్కరలేదు,
స్థిర ప్రజ్ఞుడని చెప్పనక్కరలేదు,అద్వైత మత ప్రచారానికి కంకణం కట్టూకొన్న
ధ్రీరుడని చెప్పనక్కరలేదు,ఆ మూర్తిని చూడగానే ఎవరయినాసరె నతమస్తకులయి
హస్తాలు ముకుళించ వలసిందే.ఆమహాక్స్వి స్థుతికి అర్హుడు కాని దేవుడుకాని, దేవతకానీ లేరు.
చిన్న వయసులో పేదరాలి ఇంటికి బిక్షకు వెళ్ళి ఏమీ నివెదించలెని ఆమె దీన పరిస్థితి గమనించి
లక్ష్మీదేవిని స్తుతించి బంగారు ఉసిరికాయలను ఇంటినిండా కురుపించిన దాత.ముదిమి కారణంగా తల్లి నదీ స్నానానికి దూరంగా వెళ్ళలేక పోతే ఆనదిని ఇంతిగడప్ ముందు ప్రవహింప చేసినశక్తిమంతుడు.ఎక్కడవున్నా
వచ్చి తల్లికి అంత్య క్రియలు చేస్తానని వాగ్దానంచేసి నిలబెట్టుకొన్న సుపుత్రుడు.భారత దేశానికి
నాలుగు దిక్కులలో నాలుగు మఠాలు శ్రంగేరిలొ,ద్వారకలొ ,పూరీ జగన్నాథ్ లొ
జోషీమఠ్ లొ స్థాపించి వాటి విధులు, నియమాలు నిర్ణయించి భక్త గణాలకి మౌక్ష ద్వారాలుతెరిచిన మహాత్ముడు,కాలినడకన భూమండలాన్ని చుట్టివచ్చిన ధీరుడు.
ప్రజల దగ్గరికి నడచి వారికి స్తొత్రాలు,స్తుతులు అందించి హిందూ ధ్ర్మాన్ని వారి హృదయాలలో నాటి నీరుపోసి పెంచి ఆధ్యాత్మికపు పంటలు పందించిన కృషీవలుడు.
శ్రీశంకరాచార్యులవారు రచించిన ఏస్తోత్రంలో నైనా శబ్దాలువజ్రాలు,మణులు పొదిగినట్లు పొందికగా అతికి వుంటాయి.ఒక్క శబ్దం తీసి మరో శబ్దం అక్కడ ఎవరూ పెట్టలేరు.ఈశబ్దం వెలవెల బోతూంది,ఈశబ్దం ఇక్కడ భారంగావుంది అని ఎవరూ ఎత్తి చూపలేని రచన వీరిది.
వీరు ఉత్కృష్టమైన భాష్య గ్రంధాలు18 రచించారు,ప్రకరణ గ్రంధాలు 40రచించారు,లఘు గ్రంధాలు74రచించారు.పండితులకి,ప్రజ్ఞావంతులకి కావలసిన స్థాయిలో ప్రేరణాత్మకంగారచనలుచేసి,భవ సాగరం లో ఈదులాడే భక్తులకి ఊతగాఎన్నో స్తుతులు,స్త్రొత్రాలు రచించారు.కనకధారాస్తవం,అయిగిరినంద్ని, లక్ష్మీనృసిమ్హ కరావలంబ స్త్రోత్రం, భవాన్యష్టకమందరినోటా పలుకుఊ,విన్నవా రికి, చదివిన వారికిమనశ్శాంతిని, ఆనందాన్ని అందిస్తున్నాయియుగ యుగాలదాకా ముఖే ముఖే ప్రచారమవుతూనే వుంటాయి.
32సంవస్తరాలలో శ్రీశంకరాచార్యులవారు అద్భుతమైన ,అనూహ్య మైన కృషి చేసారు.12 సంవస్తరాలు శంగేరీలో బ్రహ్మ విద్యా ప్రచారం చేసారు.శృంగేరీలో తమ ప్రియ శిష్యుడు సురేస్వరాచార్యులను శ్రీశారదా పీఠానికి అధిపతిగా చేసి,తాము కైలాసాన్నుంచి తెచ్చిన చంద్ర మౌళీశ్వరుడనే స్ఫటిక లింగాన్ని,ర్త్నగర్భ గణపతిని,శ్రీచక్రమును నిత్యపూజలకై ఇచ్చి శ్రీశారదా దేవిని ప్రతిష్టించి శృగేరీ పీఠాన్ని భక్తులకి కొంగు బంగారంగా చేసారు.అట్టి మహనీయుని జయంతి సందర్భంగా స్మరించి వినయంగా ప్రణామంచేస్తూ కృతజ్ఞతాక్షరాలతో -
టి.జ్ఞానప్రసూన

No comments: