కూరలు తెమ్మని అనుతో చెప్పడం మర్చిపోయాను.
మా అమ్మమ్మ గారి వూరిలో కూరగాయల సంత జరిగేది,వారానికిఒక్కసారె.
అప్పుడు కూరలు తెచ్చుకొని అందులో త్వరగా వడిలి పాడయిపోయే కూరలు
ముందుగా వండుకొని అరటికాయలు,మామిడికాయలు నీళ్ళల్లోవేసి అట్టెపెట్టెవాళ్ళము.
మామూలు కూరలు అయిపోయాక వీటిని వాడి, తరువాత దుంపకూరలు వాడేవాళ్ళము.
అలాగేదుంపలేవైనా వున్నాయేమోనని చూసాను. U.s లో కూరలు రుచిమాట అడక్కుండా
వుంటే చూడటానికి చాలా తాజాగా పచ్చివే తినాలనిపిస్తాయి.ట్రేలో దోసకాయలంత
చేమదుంపల్లాటివి కనపడ్డాయి.అది చూసి పెండలమేమో అనుకొన్నాను.తరిగితే చేమదుంప
లానే వున్నాయి.తెచ్చి చాలా రోజులయినట్లున్నది చిన్న మొలకలు వస్తున్నాయి.చివళ్ళు
కొంచెం పెద్దగా వదిలి కోసి ఒక పక్కన పెట్టి దుంపలు పెచ్చు తీసి ముక్కలు తరిగి
కూర చెసాను.''చేమ వేపుడు,కొంప మాపుడూ' అనేవారు అమ్మమ్మ గారు. ఈదుంపలు మునిగేలా
నూనె పోసి వేగిస్తే కానీ ఈ దుంప కూరలు బాగుండవు.ఆ కత్తిరించిన కొసళ్ళు నేల
మీద పాతితే మొక్కలు వస్తాయేమో? అనిపించింది. మాది ఫస్ట్ ఫ్లొరు,కిందకి తొంగి చూసాను.
కింద చెక్కలతో ఒక వరండావుంది.ఎండాకాలం అక్కడ కుర్చీలు వేసుకు కూర్చుంటారు.
ఆ వరండాకి పిట్టగోడలా స్తంభాలు చెక్కవే పెట్టి వున్నాయి. వాటికి పొడుగాటి
ప్లాస్టిక్ తొట్టెలు కట్టి వున్నాయి. మట్టి ,పీచు తొ నిండివున్నాయి. అందులో పెడితే
బాగుండును అనుకొన్నాను. అవి ఎవరివో, వాటిపై మనకు హక్కు వుందో లేదో తెలియదు.
మరి వీటిని ఏమిచేయాలి? మొలకలు రాబోతున్నాయే? సరే! ఇంట్లొ పార్టీ ప్లేట్స్ వున్నాయి.
రెండింటిని జత చేసి ఈదుంప ముక్కల్ని అందులో పెట్టి నిండా నీళ్ళు పోసాను. వేదు ఇంటికి
వచ్చీ'ఏమిటమ్మాఇది?''అన్నాడు. మొలకలు వస్తున్నాయిరా! నీళ్ళలో పెడితే పెరుగుతాయేమో
నని పెట్టాను అన్నాను.
అలాగే ఒక ముల్లంగి పిలక కూడా పెట్టాను.రోజూ లేవంగానే వాటిని
నిరీక్షించడం ఒక కార్యక్రమం అయిపోయింది.ఒకరోజు తెల్లవారి లేచి చూసేసరికి
ముల్లంగి రెండు ఆకులు వేసింది.నాజూకుగావున్నచిన్నిపాప వేళ్ళు పైకెత్తినట్లుగా అనిపించింది.
చేమకి తామరాకులాటి ఆకులు వస్తాయి. మంచిగా నేలలో పాతితే అర చెయ్యంత ఆకులు
వస్తాయి. ఆ ఆకులతో కూర చేస్తారు. బియ్యపు పిండినిఉప్పుతారు.అంటే పొంగుతున్న నీళ్ళలో
వుప్పు,కారం, జీలకర్ర వేసి కాస్త నూనె వేసి అందులో బియ్యపుపిండిపోసి బాగా కలిపి
చల్లారాక, చేమ ఆకులు కడిగి పెట్టుకొని, ఆ చేమ ఆకులపై పూతలా పుయ్యాలి.వాటిని
కాజాలకోఅసం చుట్టినట్లుగా చుట్టి ఆవిరిమీద ఇడ్లీల లాగావుడికించాలి.తరవాత తీసి
బ్రెడ్ రోల్స్ లాగా రెండేసి అంగుళాల ముక్కలు కోసి నూనెలో వేయించాలి. వేడి వేడిగా
తింటే బాగుంటాయి.అన్నంలో కూడాతింటారు. ఆశకి అర్ధం వుందా?మనస్సుకు ఆపు వుందా?
రెండు రోజులకి ముల్లంగి మరో రెండు ఆకులు వేసింది.ఇంట్లో ఒక
చిన్న గాజు కప్పు కనిపించింది దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ముల్లంగి మొలకని
దాంట్లో పెట్టాను. తనని ప్రత్యేకంగా చూస్తున్నానని గర్వం వచ్చిందో ఏమో ఇంకా కొన్ని
ఆకులు వేసింది. గాజు కప్పులో గురిగమ్మలా కూర్చున్నది. దాన్ని ఒకరోజు టెబిల్ మీద పెట్టాను.
అదిచూసి అను,వేదులకి ముచ్చట వేసింది. ''అత్తయ్య గారూ ఈచేమ దుంపల్ని కూడా వేరే వేరే
పెడ్దామా?అంది. ఇదే మన ఇండియా అయితే కింద కెళ్ళి కాస్త మట్టి తవ్వుకు వచ్చేదాన్ని. ఇక్కడ
ఏమి ముట్టు కొందామన్నా తప్పే. ''మట్టికావాలిగా? అన్నాను. కొనుక్కొద్దాము.అంది.ఇవి బతుకుతాయో లేదో
తెలియదు వాల్ మార్కెట్కు వెడితే అన్ని అయిదుకిలోల బస్తాలు వున్నాయి.యెరువుమట్టి అంతా అదేట.మూడు
నెలల దాకా పనికివచ్చే యెరువు ఒకధర, తొమ్మిది నెలల దాకా పనికి వచ్చే యెరువు ఒకధర.
స్ప్రింగ్ కదా?అని తొమ్మిది నెలలదాకా పనికొచ్చే యెరువు అయిదు కిలోలది కొని ఇంటికి తెచ్చాము.ఇక మట్టిపో సి దుంపల్ని ఎందులో పెట్టాలి? మళ్ళీ పార్టీ ప్లాస్టిక్ గ్లాసులు గుర్తుకు వచ్చాయి.చేమ పిలకలు ఎనిమిది వున్నాయి.పదిగ్లాసులు తీసాను.అను అన్నదీ'ఇందులో పెస్టి సైడెస్ కలుపుతారండీ.గ్లౌసెలు వేసుకొని వాడండి అని.
వాటికోసం ఆగేలాలేదుమనస్సు. ప్లాస్టిక్ సంచీ ఒకటి చేతికి తొడుగులా తొడుక్కొని ఒక ప్లాస్టిక్ గ్లాస్తో ఎరువు తీసి తక్కిన గ్లాసుల్లో పోఅసి ఒక్కొక్క పిలకె తీసి ఒక్కొక్క గ్లాసులో పెట్టాను.ఆ గ్లాసులు మందారపువ్వులలాగాఎర్రటి రంగులో వున్నాయి.లోపలి వేపు తెలుపు.తినే సోంపు వుంటుంది చూడండి
ఆమొక్క ఒకసారి వేసాను. చాలా నాజూకుగా తురాయిలాగా పెరిగింది.ఒకదాన్లో కాస్త సోఅంపు జల్లాను.
చేమ మొలకలు నాలుగు పెద్దవిగానీ. తక్కినవి చిన్నగా వున్నాయి.ఆ నాలుగు గ్లాసుల్లో చారెడు మెంతులు జల్లాను.
వీటికి నీళ్ళు అంతగా పొయ్యక్కర లేదుకానీ, ఒకవేళ పోస్తున్నప్పుడు కింద పడ్డాయంటే కష్టం, ఎందుకంటే ఈ ఇంట్లో ఫ్లోరింగ్ అంతా చెక్క.అందుకని వీటిని పళ్ళెంలాటి దాంట్లో పెట్టాలి. పార్టీ ట్రేలు జర్మన్ సిల్వర్ వి వున్నాయి.
అవితెచ్చాను. ఒక్కొక్క త్రేలో అయిదు గ్లాసులు .ముల్పట్టాయిలంగి మొలకని కూడా గ్లాస్ లో పెట్టాను.విశాలంగా పెరుగుతుందని.వెండి ట్రే,ఎర్రటి గ్లాసులు, ఆకుపచ్చని మొలకలు ఎంత బాగున్నాయోఅ! పొద్దున్నే వాటిని చూస్తూంటే
ఏదో ఒక ఆకు వస్తుంది.నాలుగు రోఅజుల్లో మెంతులు వుబ్బి మరో రెండురోజులకి మొలకలు వచ్చాయి. ముల్లంగి మాత్రం ఖింద ఆకులు పచ్చబడిపోయాయి. తీసేద్దామా అనుకొన్నాను.ఒక రోజు చూస్తే మొలక చర్రుమని రెండు అంగుళాలు పెరిగింది.చిన్న చిన్న ఆకులు వేస్తోంది.పరిశీలనగా చూస్తే మొగ్గలు కనిపించాయి. నిన్న వైలెట్ రంగులో ఒక ఉ పూస్తుందనే తెలియదు. పార్టీ ప్లెట్లు వున్నాయి, ఎరువు వుంది, వెళ్ళి పాలకూర విత్తనాలు అవీ తెద్దామా అని ఆలోచిస్తున్నాను.నాలుగు తోటకూర,గింజలు,గోంగూర గిజలు,విత్తనా లన్నా తెచ్చానుకాదే అని విచారిస్తున్నాను.గ్లాసుల్లో మొక్కలతో ఏమేమి అనుభూతులు వస్తాయో తెలియ పరుస్తాలెండి.
టి.జ్ఞాన ప్రసూన
4 comments:
I am looking fwd to know what hpnd with your kitchen garden.. It is so lovely to wait and watch them grow.
నేను మరో సుజాతనండీ! చాలా బాగుంది మీ తోట పని! నేను USలో ఉన్నప్పుడు స్నేహితులు ఇండియా నుంచి వస్తుంటే గోంగూర విత్తనాలు తెప్పించుకుని homelandలో మట్టి, కుండీలు కొని గోంగూర, మల్లె తీగ(ఇదీ హోం లాండ్ లో కొన్నదే) పెంచాను. ఒక వియత్నామీ స్టోర్స్ లో బచ్చలి కూర దొరికితే దాన్నీ తీగలా పెంచాను.
ఇప్పుడు అటువంటి విత్తనాలూ అవీ తీసుకెళ్లడం నిషేధమట!
మీరు చెప్పిన చేమకూర రోల్స్ మా అమ్మ గారు వండే వారు.
మీ క్రితం టపా అక్వేరియం గురించి కూడా చదివాను. మీరు వచ్చిన తరువాత ఒక ట్రావెలాగ్ రాస్తే బాగుంటుందనిపిస్తుందండీ!
US వెళ్ళినా అక్కడ కూడా కూరగాయల మొక్కలుపెంచేస్తున్నారన్నమాట. ఒక్కసారి నాకు మెయిల్ చేయగలరా? మీరు ఇచ్చిన అడ్రస్ కి పంపిస్తే నాకే తిరిగొచ్చింది మెయిల్..
jyothivalaboju@gmail.com
గ్లాసుల్లో కూడా పెంచొచ్చని మీ టపా చదివాకనే అర్ధం అయిందండి.నేను పూల కుండీల్లాంటి వాటిలో పచ్చిమిరప,టొమేటో పెంచుతున్నాను.నా స్నేహితులయితే బీన్స్,పుదీనా,బెండ,కరివేపాకు లాంటివి కూడా పెంచుతున్నారు.మీ మొక్కల ఫొటోలు పెట్టివుంటే చూసి ఆనందిచేవాళ్ళం.
Post a Comment