Pages

Tuesday, May 20, 2008

కంప్ యూటర్ కష్టాలు

* కంప్యూటర్ కష్టాలు ఒకటా*
ఒకటా?రెండా?కంప్యూటర్ నెర్చుకొందామని మొదలు పెట్టినప్పటినుంచీకష్టాలే!''గురువులేని విద్య గుడ్డివిద్యా'
అనే సామెతకి అర్ధం కంప్యూటరె చెప్పింది.విదేశాలు వెళ్ళడమే భలే అనుభవం, వింటర్ లొ వెళ్ళడం వింత అనుభవ
అందునా కెనడా వెళ్ళడం చాలెంజ్. విదేశానికి వెల్తున్నామంటె బంధువులు,శ్రేయోభిలాషులు ''జాగ్రత్తగా,హాపీగావెళ్ళిరండి,వెళ్ళగానే కులాసాగా చేరాను.అని రెండుముక్కలు ఫొనులొ చెప్పండి
ఉత్తరం వ్రాయండీ'అని వీడ్కోలు చెపుతారు.ఇంటికి చేరి సొఫాలొ చతికిల పడగానె వాళ్ళందరి మాటలు గుర్తుకొచ్చాయి.చేసే పనేముంది?పొద్దున్నే అందరికి తలొ ముక్కా వ్రాసి పడేద్దామనుకొన్నాను. మావాళ్ళని పోష్టాఫీస్ ఎక్కడుంది? అని అడిగా.పొష్టాఫీసుకు వెళ్ళాలంటె మా వర్క్ ప్లెస్ కి వెరే డైరెక్షనులొ పది కిలొమీటెర్లు వెళ్ళాలి. అన్నారు.
కవర్లు కొనితేవడానికి ఒకసారివెయడానికి మళ్ళీవెళ్ళాలి.పైగా ఆఉత్తరం ఇండియా చేరేసరికి 15 రోజులు పడుతుంది.
కాసెపయాక చూసేసరికి ఇంట్లొ పసిపిల్ల బాలాది అన్నట్లుగా తలొ లాప్ టాప్ ఒళ్ళో పెట్టుకు కూర్చున్నారు.ఇల్లు నాలుగు మూలలా చూసొచ్చాను.ఇంకా అందరూ అదె పోలొ వున్నారు. మా అబ్బాయినడిగితే షేర్లు చూస్తున్నానమ్మా!అన్నాడు,కోడల్ని అడిగితే బిల్లులుకడుతున్నా అత్తయ్యగారూ!అంది.మనవరాలిదగ్గరికి వెడితె రా!బామ్మా! అంది లాప్ టాప్ లొంచి తల తీయ కుండానే పరీక్ష ఫీజ్ కట్టమని బాంక్ వాళ్ళకి మైల్ చెస్తున్నా బామ్మా!అంది.''అదీ ఇందులొనెనా?"''ఇదేమిటి, ఇంకాచాలా చాలా పనులు చేస్తాము.లెటర్లు
వ్రాయడం,వాళ్ళు వ్రాసినవి చదువుకోవడం-అంది.బాగానె వుంది అనుకొన్నా.స్టాంపులు?అన్నా.అదినవ్విఫ్రీ బామ్మా!అంది.
అందరికంటె మాకోడలు ఆఫీసుకు ముందువెళుతుంది.తన లాప్ తాప్ తీసుకొని ఒళ్ళో ఎలా పెట్టుకోవాలో పెట్టుకుచూసా! తెలికగానె వుంది. పొద్దున్నె సైబాబా హారతులు వినిపించాయి. రదిఒ లాటిది కనపడలా!తీరాచూస్తె అదీ లాప్ తాప్ లొంచె! మాకొడలు ఇలాత్య్పె చెసి ఇక్కడ చ్లిక్ చెస్తె రొజూ మీరూ ఇవన్నీ వినొచ్చు అని చూపించింది. రెండు రొజులు పోయాక మనవరాల్ని ఉత్తరం ఎలా వ్రాయాలె!అని. అది ఇది టపటపా నొక్కి తెల్లటితెర ఎదురుగా పెట్టి రాసుకొ బామ్మా!అంది.అక్షరాలన్నీ ఇంగ్లిష్ లొ వున్నాయి. తెలుగులొ ఎలా వ్రాయాలి. తెలుగుభాషలొ అయితె వ్రాయడానికి చదువుకోడానికి భాగుంటుంది.
చిన్నప్పుడు మేము తెలుగు నేర్చుకొనేటప్పుడు హల్లులన్నిటికి గుణింతాలు నేర్పేవారు పధ్ధతిగా.
క కాకు గుడి ఇస్తె కి అని నెర్పెవారు.అలాగె గుణించుకొంటూ వ్రాద్దాం అని మొదలెట్టాను.చి అని టైపె చేసి తరవాత రెండు గీతలు పెట్టాలిగా!ఏది టైప్ చేయాలొ తెలియదు రెండు ఐ లుకోట్టి పేరు వ్రాసి నాలుగు లైన్స్ వ్రాసా.ఉత్తరం అయిపోయింది .సెండ్ దగ్గర క్లిక్ చేయాలి,నా ఆవేశం అంతా నావేలులోకి వచ్చి క్లిక్ చేసా కానీ ఎక్కడ?సంతొషంలో పైకివెళ్ళి బాక్ పేజి యారోని క్లిక్ చెసా తీరా చూఅతే స్క్రీన్ అంతా అంతా తెల్లగా నన్ను చూసి హి హి హీ అంది.చిన్నపుడు తినే తినే ఐస్ ఫ్రూట్ చేతులోంచి ఎవరన్నా లాక్కుంటె ఎంత ఏడుపు వచ్చేదో-అంత ఏడుపు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేరుకనుక పరువు దక్కింది.''అమ్మా!నువ్వుఫొనె చెస్తే నాకు రాదు, నెనే చేస్తూంటా''అన్నాడు మా అబ్బాయి.తను లంచ్ టైమెలొ చేస్తాడు.లంచ్ టైమెలో ఏమి అడుగుతాను,ఇక రాత్రికే!
రాత్రికి మనవరాల్ని అడిగితే' నువ్వు తప్పుగా క్లిక్ చేస్తే ఎలా బామ్మా?లాప్ టాప్ దగ్గర అలర్ట్ గా వుండాలి,గబ గబా పనిచేయాలీ' అంది.అలర్టా? క్విక్నెస్సా? ఈ వయస్సులో అవి ఎక్కడనుంచి తేనూ?పైగా నిదానమే ప్రధానంగా బతికిన దాన్ని.మళ్ళీఉత్తరం టైప్ చెసా.అత్తగారు ఎక్కడికో వెళ్ళినట్లు యారొ పక్కింటికో ఎటో వెళ్ళిపోతుంది.అది వుంటే కానీ పని జరగడు.దాన్ని వెతుక్కొచ్చి కూచో పెడదామంటే నాలుగు మూలల్లో ఏమూలలో వుందో తెలియదు.దాక్కుంటుంది.మౌస్ ని గంధపు చెక్కలాగా అరగ్దీసినా అదెక్కడుందో తెలియదు.ఏదో ఒక దారం మౌస్ ని లాప్ టాప్ ని కలిపి వుంచినట్లనిపిస్తుంది.ఈ మౌస్ ని అరగదీస్తూ అడ్డంగా నిలువుగా గుండ్రంగా తిప్పుతూంటే ఆదారం తెగి పోతుందేమో నని భయం వేస్తుంది.ఒకలైను టైపుచేసా.కానీ ఆత్రంగా అనెచోట సత్రం అనిచెసా.యారో అత్తగార్ని పిలుచుకొచ్చి సని తొలగించి ఆ ని పెట్టాను.తప్పు దిద్దుకోగలిగానని విజయ గర్వం వచ్చింది.వాక్యం ఇలావుండాలీ'వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయిందని తెలిసి జగ్గు ని ఆత్రంగా వెళ్ళి పలకరించాను.చదివితే'' జగ్గు ని చూడగానే ఆత్రంగా వాళ్ళ అమ్మమ్మ చ చ్చిపోయిందని తెలిసింది పలకరించాను ''అనివుంది.ఆవాక్యం సరిచెయాలంటె ఎలాగా?తెలియదు.మొత్తం తీసేసి మళ్ళీ తైప్ చేసాను.ఇలాటి సదవకాశాలు వందలు వేలు వచ్చాయి.ద్:ఖానందంతోఅన్ని బాగు చేసుకొన్నాను.ఇక కంప్యూటర్ సోధనకి చుక్క పెడదాం అని నిశ్చయం చెసా.
అరవై ఏళ్ళు వచ్చాక చదువుకోక మట్టికొట్టూకుపోఅనా?అనిసామెత.కంప్యూటర్ నాకెందుకు చెప్పండి?నెనేమన్నా ఉద్యోగం చేయపోయానా? బాంక్ అకౌంట్లు,షెర్ మార్కెట్లు చూస్తానా?భగవంతుడు ఇవ్వదలుచుకొంటే ''చప్పర్ ఫాడ్ కె దేతాహై''అంటారు.దేవుడు ఏదైనా ఇవ్వ దలచుకొంటే ఇంటికప్పు పగల కొట్టి ఇస్తాడట.మా ఇంటి కప్పు బాగానే వుందికానీఒక శుభోదయాన,శుభముహూర్తాన లాప్ టాప్ నా ఒళ్ళో వచ్చి పడింది. ''అమ్మా!నువ్వు కంప్యూటర్ నేర్చుకొంటున్నవుగా!వాడుకో!క్రిస్మస్ గిఫ్ట్ అన్నాడు.ఇక దాని ఎలా వదులుతాను?నా శోధన సాగించాల్సిందే!
చిత్రం ఏమిటంటే ఇది రావడం లేదు ఎలా చేయాలి అని కంప్యూటర్ పండితుల్ని అడిగితే - వాళ్ళు మత్స్య యంత్రాన్ని కొట్టేందుకు వచ్చే అర్జునుడిలాగా వచ్చీ'అదా!అదేముంది?''అని సురభి కంపెనీలో హార్మోనిష్ట్ లాగా టకటకా పది క్లిక్ లు కొట్టి ''సరీయిపోయింది,పనిచేసుకో అని వెళ్ళిపోతారు.అబ్బా!చిటికెలో చేసారే?అని ఆశ్చర్య పడిపోతాము.వాళ్ళు ఏమి చేసారో మనకి తెలియదు.అడుగుదా మంటే ఈరోఅజుకు పని అయిందికదా!అనుకొంటాము. మనకీ వచ్చినట్లే అనిపిస్తుంది. లెఖ్ఖలలొ మేధావంతులైన శకుంతలాదేవి,రమానుజం లాటివారి బుర్ర మనకి వుంది అన్నట్లుగా పోజు.ఒకోసారి యారోని అత్తగార్ని సరైన స్థానంలో వుంచిఒకవాక్యం తైపుచేసి సంతోషంగా తల ఎత్తి చూస్తే అక్కడొక అక్షరం వుంటే ఒట్టు.మంకుతెలియకుండానే ఏదో నొక్కి వుంటాము.టైపు చేస్తూ స్క్రీన్ చూడాలి అత్తయ్యగారూ!అందికోడలు.తైప్ చేసేటప్పుడు ఏమి తప్పులు చెస్తామౌ అని హడిలి చస్తూన్నా ''మాధవా అనడానికి వెధవా అని తైప్ చెస్తున్నా.ఇంకా స్క్రీన్ని ఎక్కడ చూడనూ? నాకెం రెండు తలలు, నాలుగు కళ్ళూ వున్నాయా?
స్పీడు వచ్చేందుకు ఇదుగో ఇక్కడికి వెళ్ళండి అని ఒక సైటు డెస్క్ టాప్ మీద ఫిక్స్ చెసిండి
కోడలు.మనం అక్షరాలు టొకాఇప్ చేస్తే మన స్పీడు చెపుతుంది. తప్పు చేస్తే గుర్రుమంటుంది.ఎలా? లాప్ తాప్లోంచి
చెయ్యివచ్చి నెత్తిమీద ఓ మొట్టికాయ వేస్తుందేమోనని భయం వేస్తుంది.దాని ప్రాక్టీస్ రొజూ ఒక గంట .మనవడు మైసూర్ పాకం చేసిపెట్టు బామ్మా!అంటే ''మైసూర్ పాకం చాలా సేపు తిప్పాలిరా నానా!చెయ్యినెప్పీన్నా.ఇది తైపు చేస్తూంటే రోజుకోసారి మైసూర్ పాకం చేసినట్లు చేయి నొప్పి పుడుతూంది
ఒక గురువారం నాడు సాయిబాబా హార తి వినిఏదైనా తైప్ చేద్దామని మొదలెట్టాను.ఇంతలో ఏదో ప్రకటన స్క్రీన్ మీదకి వచ్చింది.అందులోఅంచి చిక్ చిక్ అంటూలైటుకాంతి వెలుగుతూ ఆరుతూవస్తూంది.ఏమిటా అని చూస్తే''మీకు లాతరీ వచ్చింది.మీదే లక్ష పూర్తయిన నెంబరు ఫలానా చోట క్లిక్ చేయండి,ఫ్రీగా సెల్ల్ఫొనె,10c D లు + మియామీకి షిప్ తికెతనివుంది. అబ్బా! సాయిబాబా ఎంత లాభం చేసాదోబబూ అనీరిచా. నామాట నాదగ్గరికే వచ్చింది.ఇంట్లొ నేనుతప్ప మరో ప్రాణిలేదు.క్లిక్చెసేద్దాం ఆలశ్యమయితే మళ్ళీ లాటరీ పోతుందేమౌ అని ఖంగారు పడ్డా.ఎందుకైనా మంచిదని కోదలుకీ ఫోను చేసా.ఆవేశంగా నాకు లాటరీవచ్చిందే అన్నాను.ఎక్కదలాటరీ అత్తయ్యగారూ!ఎక్కడేమిటే అదే వచ్చి ఒళ్ళో పడింది.అదృష్టం అన్న.అయ్యోఅ దాన్ని ముట్టుకోఅకండీత్తయ్యగారూ!అది క్లిక్ చేసారంటే వాటితో పాటు వైరస్ లు వస్తాయి. లాప్ టాప్ పాదయిపోతుంది.అంది.కంప్యూటర్ మూసి వేస్తేకానీ అదిపోలా.
ఈకమొయూటర్కి ఎన్నో తెలివి తేటలు వున్నాయి.ఎన్ని తప్పులు చేసామౌ లెఖ్ఖ కట్టి టాంటాం వేస్తుంది.విండోలు మూయకపోఅతే మూయలేదనిచెపుతుంది.కనిపెట్టినవాడు గొప్పవాడే!

9 comments:

oremuna said...

chaalaa baagaa vraaSaaru.

cbrao said...

జ్ఞాన ప్రసూన గారు, మీరు ఈ వయసులో కంప్యూటర్ నేర్చుకుని, తెలుగు యునికోడ్ లో రాస్తున్నందుకు అభినందనలు. మీరు రాస్తున్న ప్రతి వ్యాసానికి ఒక శీర్షిక (పేరు) వుండటం అవసరం. అలా లేకుంటే కూడలి లో మీ వ్యాసం ' సురుచి : (శీర్షిక లేదు)' లా ప్రచురించబడుతుంది. మీ జ్ఞాపకాలు (రచనలు) ఎక్కువయ్యేకొద్ది శీర్షికలేని రచనలతో, ఏది ఏ వ్యాసమో గుర్తించటం మీకే కష్టమవుతుంది. మీ వ్యాసాలకు Labels అంటే categories కూడా ఇహ నించి రాసే వ్యాసాలకు ఇవ్వండి.ఇది మీకు, పాఠకులకు ఉపయుక్తం. నేను చెప్పేది మీరు చేయలేకున్నచో, పిల్లల సహాయం తీసుకోండి.

Sujata M said...

చాలా బావుంది. మౌస్ ని గంధం చెక్క లా అరగదీయడం, మాధవా అని టైపు చెయ్యబోయి వెధవా అని టైపు చెయ్యడం.. లాంటివి చాలా బావున్నాయి. మీ బ్లాగ్ చాలా బావుంటుంది. పోస్ట్ చేసే ముందు, మీ పోస్ట్ శీర్షిక ను మాత్రం, సెలెక్ట్ చేసి, మౌస్ కున్న లెఫ్ట్ బటన్ తో కాపీ చేసి, పోస్ట్ బాక్స్ పైనున్న 'టైటిల్' పెట్టెలో మౌస్ అత్తగారిని ఉంచి, పేస్టు చెయ్యండి. రావు గారి సలహా ప్రకారం, మీరు మీ ప్రతీ పోస్ట్ కూ శీర్షిక పెడితే, మీ బ్లాగ్ లో ఉన్న బోల్డన్ని పోస్టులను తేలికగా గుర్తించి, చదవడానికి మాకు వీలవుతుంది. మీరు ఈ విషయంలో జ్యోతి గారి సలహా కూడా తీసుకోవచ్చు. మీ మొక్కలు బావున్నాయని తలుస్తాను.

నిషిగంధ said...

కంప్యూటర్ తో మీ అనుభవాలు చాలా బాగా రాశారు.. 'యారో అత్త గారు ', 'మౌస్ ని గంధం అరగదీసినట్లు ' ఇలాంటివి చదువుతుంటే నవ్వు ఆగలేదు :-)

మాలతి said...

మొన్న ఆదివారం మిమ్మల్ని నెట్లో కలవడం సంతోషంగా వుందండీ. పైవ్యాఖ్యలకి డిటో నామాట కూడా.
అభినందనలతో

SD said...

మామ్మగారు
మొత్తమ్మీద మీ సెన్సాఫ్ హ్యుమర్ అదిరిపోయింది. చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. మీరు ఇంట్లో కూడా ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉంటారా? అయితే మా ఇంటికి వచ్చేసి మా అమ్మాయికి నాలుగు తెలుగు ముక్కలు నేర్పి వెళ్ళండి. దారి ఖర్చులు నావేనని వేరే చెప్పఖ్ఖర్లేదనుకుంటా!

ఓ బ్రమ్మీ said...

జ్ఞాన ప్రసూన గారు,

మీకు జేజేలు .. కేక.. ఇంకేం .. ఇదే అదునుగా .. మీ మొదటి విమానయానం మీద కూడా ఇట్లాంటిదే ఒకటి వ్రాసేయ్యండి.

చాలా బాగుంది. మీ అనుభవాలు చదువుతుంటే, మా అమ్మ గుర్తుకొచ్చింది. కాక పోతే, మా అమ్మ మీలా కాదు కానీ .. చెప్పగా చెప్పగా ఇప్పుడే సుముఖత చూపుతోంది.

ఇంతకీ ఎవ్వరికైనా ఉత్తరాలు వ్రాసారా? పనిలో పనిగా నాకూ ఒకటి వ్రాసేయ్యండి. అతా పతా అంటారా.. ఎదో ఒకటి వ్రాసి పడేయ్యండి. తీసుకునే భాద్యత నాది.

ఏమంటారు?

Prakasa Rao said...

I don't have unicode in my computer and I didn't try to install one such till date. After going thru your articles I am unable to sit idle without learing to type Telugu.Your humour and language are superb.I can not appreciate better than this as I am not a poet like u but expression is overwhelming & overflowing from my heart.

Unknown said...

chaalaa baagaa vraasaaru maammagaaru... ee vyaasam caalaa baagundi...