Pages

Sunday, May 18, 2008

చుక్క v

చుక్క
చుక్క అంటె తార ,నక్షత్రం అనితెలుసుమనందరికి.
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కల్చర్ వచ్చాక పిల్లలు స్టార్ అంటేనే నక్షత్రాలని
చూపిస్తున్నారు.చుక్క పెట్టు,అప్పుడు వాక్యం పూర్తి అయినట్లు,అనేవారు మా తెలుగు
టీచరుగారు.నీటి బొట్టుని కూడా చుక్క అంటారు.''ఇంట్లో ఒక్కచుక్క నీళ్ళులేవు.''
''ఓచుక్క నెయ్యివెయ్యమ్మా ''''ఎవరేనా బొట్టునెయ్యి వేసుకొంటే ప్రాణం పోయినట్లు
గిలగిల లాదతారు.అంటారు.బొట్టుపెట్టుకొనే చుక్కనీ'అగరూ'అనీంటారు.పసి పిల్ల
లకి దృష్టి దోషం తగలకుండా తల్లి నుదుటిపై నయా పైసంత నల్లటి చుక్క బొట్టు
పెడుతుంది.కణతలమీద చుబుకం మీద పెడుతుంది.ఇంట్లో ఎవరేనా నీళ్ళుపోసుకొంటె
వాళ్ళకి 8,9నెలలు వచ్చేసరికి కాటుక,చుక్క ఇంట్లో తయారు చెసేవారు.ఆరోజుల్లో
ఆముదం ఇళ్ళల్లో విరివిగా వాదెవారు.ఆముదం దీపాలు, పసిపిల్లలకితలకి,ఒంటికీఅముదం
పట్టించెవారు.కళ్ళ ల్లో,చెవుల్లో బొట్లు వెసెవారు.దాంతో పురిటివాసన వచ్చి
చెప్పకుండానెపసిపిల్ల ఇంట్లో వుందని తెలుస్తూండేది.
కాటుక పట్టడం-కాటుక ఇంట్లో తయారు చెయడం.గంధం అరగతీసె
టందుకు రాతి సాన వుండెది,గంధపు చెక్క వుండెది.పూజకి గంధం వాదెవారు.అరటి
పువ్వు దొప్పలు కాల్చి ఆమసిలో కొంచెం నీటిబొట్టువేసి భోజనం చెసెముందు మగవాళ్ళు
గంధపు బొట్టుపై ఇది పెట్టుకొనెవారు.పచ్చ్టి గుండ్రంలొ ఎర్ర్టి బొట్టు వుండేది.ఆబొట్టు
చూస్తె వాళ్ళు భోజనం చెసి నట్లు లెఖ్ఖ.ఆ బొట్టు మొఖాన లేకపోతె భోజనానికి
ఆహ్వానించెవారు.అందుచెత అందరి ఇళ్ళల్లో సాన గంధపు చెక్క తప్పనిసరిగా వుండెవి.
సాన చెక్క, రోలు, రోకలి,చేట,తిరుగలి అన్ని లక్ష్మీ ప్రదంగా భావించెవారు.
ఆగంధపు చెక్క,సాన శుభ్రంగా కదిగిఓ చిన్న గిన్నె నిండా గంధం తీసేవారు.ఇత్తడి
పళ్ళాన్ని తళ తళా లోమి ఈ గంధం పళ్ళానికి అడుగుభాగానపూతలా పూసెవారు.గదిలో
గాలి చొరకుండా,తలుపులు,ఇటికీలు ంప్ప్సి,మూడు ఇటుక రాళ్ళు పొయ్యిలా అమర్చి వాటిమధ్య
ప్రమిద పెత్తీఅముదంపోసి వత్తివేసి దీపం వెలిగించెవారు.ఆరాళ్ళమీద గంధం పూసిన
పళ్ళెమువుంచెవారు. దీపసిఖ యొక్క ధూపం ఆగంధానికి పొగలా పారేది.సాయంత్రందాకా
దీపంవెలిగి గంధం అంతా మసిబారాకదాన్ని తాటాకుతో గిన్నెలోకి జార్చివెన్న,ఆముదం,
పచ్చకర్పూరంవేసిముద్దచెసి నీళ్ళధారకింద దాన్ని పెట్టి గుండురాయితో బాగారుద్దెవారు.
కాటుక మెత్తగా అయెది.ఏదయినా రుబ్బినా కాటుకలా రుబ్బారు అనెవారు.ఆకాటుక పసి పిల్లల
కళ్ళకి పెడితె కళ్ళు పెద్దవవుతాయని,దుర్మాన్సాలు పెరగవని,కళ్ళకి,మెదడుకి చలవ అని,మొగ
పిల్లలకి 5,6మాసాలదాకా,ఆడపిల్లలకి ఏడాది వెళ్ళేదాకా తప్పక పెట్టెవారు.పోను పోను
ఈకాటుకకళ్ళే కనిపించడంలేదు.సాహిత్యంలో వెతుక్కోవలి.
ఇక చుక్క ఇదీ ఇంట్లోనె తయారు చెసెవారు.చెయడం చాలా తెలిక.
ఒక బాణలిలో పురిసెదు సగ్గు బియ్యం వెసి వేగిస్తేవి వేదెక్కాక,ఒక కాగితం ముక్క కి
నిప్పంటించి అందులో వేస్తె అది బుసబుసా పొంగుతుంది.అప్పుడు కాసిని నీళ్ళుపోస్తెమెత్తబదుతుంది.
బాణలిలోనె గరిటతో నూరివెండి భరణిలోనో,గిన్నె లోనోపెట్టి ఆరబెడితె ఘట్టిపడిపోతుంది
.దానితో బాట్మింటన్ ఆడినాచుక్క కింద పడదు.పిల్లలకు నీళ్ళుపోసి,వళ్ళుతుడిచిదీనిలో ఒక
నీటిచుక్క వెసి అరగదీసి చుక్కబొట్టు పెదతారు.ఇది తయారు చెసె టప్పుడు కాస్త అత్త్రు వెస్తె
సువాసంగా వుంటుంది.ఆడపిల్లలనీ'చక్కని చుక్కా'అని వర్ణించెవారు. ఆకాశంలోని చుక్కలతో
నెలపైని కన్నెపిల్లలని పోల్చెవారు.
సోకాల్డ్ మోదరన్ కల్చరల్ సొసైటీతో పరిచయం అయాక ఇదివరకు
అర్ధగాక మరో అర్ధం వచ్చిది.చుక్కెసుకొస్తాను,చుక్కెసుకొంటాను,అంతె మద్యంసెవించడం
అన్నమాట.ఈచుక్క బారిన పడ్డాక,సాయంత్రాల అందమేపోయింది.పెందరాళె ఇంటికి రావడం-
భార్యా,పిల్లలతో పిచ్చా పాటి మాట్లాడుకోవడంపోయి,ఇంటికి రావదమె క్ష్టమయిపోయింది.
చుక్కతో వచ్చే ఇక్కట్లు అన్నీ ఇన్నీకావు.పెళ్ళిళ్ళు,పండగలు,పబ్బాలు,పుట్టినరోజులు,ఆహ్వానాలు,వీడ్కోళ్ళూన్నిటికీచలాకీ
కల్పించెది ఈచుక్కే.''పెరుగు పెద్దరికం చెరుపుతుందీనెవారు.చుక్క పోస్తె ముక్కుకోసినాసరె
అన్నట్లు ఎగబడుతున్నారు.వెదెశాలలో ''చిల్ చెసుకు వస్తాం,చిల్లయి వస్తాం''అంటారు.చిల్ల్
మాట ఏమోగాని జెబు చిల్లి పడతం ఖాయం.చుక్కకోసం దాసులయితె జీవితం చుక్కానిలేని
పడవ అవుతుందనెసత్యం ఎవరికి వారె తెలుసుకొనిచుక్క వేసుకోడానికి చుక్క పెడితె మంచిది.
ముగ్గులు వెసె టప్పుడు చుక్కలు పెడ్తారు.ముగ్గు సరిగా రావడానికి ఈచుకలె
ఆధారం.గుమ్మలకి పసుపురాసి,కుంకుమతో బియ్యపుపిండితో చుక్కలు పెడతారు.చుక్కలు పొడవదం
చుక్కలు వెలతెలా పోవడందివారాత్రాలకి సంకెతం.ఆకాశాన్నిచుక్కల పందిరిగా వర్ణిస్తారు.ఏదైనా
పనికాకపోతె చుక్కెదురైంది,అంటారు.చుక్కలలో చంద్రుడు,చుక్కరాయలు అని వర్ణలు వింటూవుంటాము.
''నీకు వ్రాసిన ప్రెమలెఖలోఅక్షరాలు రంగు రంగుల చుక్కలైనాయని కవి వర్ణన.చుక్కలని తెచ్చి ప్రెయసి కురులలో మల్లెలుగా తురమాలని ఒకకవి వర్ణన.
అసలు సంగతి వ్రాయక పోతె ఈవ్యాసం పూర్తికాదు.కంప్యూటర్ వచ్చాకేఎచుక్కకి
విలువ,ప్రత్యెకత అపారంగా పెరిగిపోయింది.చుక్కలేనిదె కంప్యూటరె లేదు.డాట్ కాం అనెది డామినేట్ చెసెసింది.ఏవిష్యమైనాసరె,చింతపండు డాట్కాం,పెళ్ళికి పూలజడ డాట్కాం,గుగ్గిలంపొగ డాట్కాం,భారతం
డాట్కాం,మృచ్చ కటికం డాట్కాం.ఈచుక్క సరైన స్థానంలో వుండి నెనున్నా నీకెమీ ఫరవాలెదూంటెనెకానీముందుకువెళ్ళలేము.ఈచుక్కకి కాస్త స్థాన భ్రశము చెసామా!పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పనీరె.ఈచుక్కేశ్వరికి రోజుకు ఎన్నిదణ్ణాలు పెట్టాలో?

No comments: