Pages

Saturday, May 24, 2008

ముట్నూరి కృష్ణారావు పంతులుగారు
మా నాన్నగారు రెడియొ టాక్స్ ఇచ్చేవారు.మద్రాసులొ రెడియొ కేంద్రం
వుండేది.రచనలు పంపిస్తే వాళ్ళు అంగీకరించి ఫలానా రోజు రమ్మని ఉత్తరం
వ్రాసేవారు.మానాన్నగారు అలాగే మానాన్నగారు ప్రసంగించడానికి

మద్రాస్ వెళ్ళారు.
పాలవాళ్ళకి, పనివాళ్ళకి అందరికి చెప్పాను.సమస్య ఏమిటంటే
రెడియొ ఇంట్లో లేదు.ఎలా వినాలి?మానాన్నగారు వెడుతూ"నువ్వు అమ్మ
కృష్ణారావుగారి ఇంటికివెళ్ళి వినండి."అని చెప్పి వెళ్ళారు.వాళ్ళ
ఇంటికి వెళ్ళాలంటే అమ్మకి నాకు భయం వేసింది.నాన్న గారి గొంతు
విలాలంటే వెరే దారిలేదు. కృష్ణారావు గారి ఇల్లుగొడుగు పేటలో
వుండేది.అమ్మ నేనూ వెళ్ళాము.
కృష్ణారావుగారి భార్య రుక్మిణమ్మగారు ఆమె బొద్దుగా,తెల్లగా పెద్ద బొట్టు
పెట్టుకొని వుండేవారు.రుక్మిణమ్మగారు ఇంట్లో కుంకుమ తయారు చేసి
గుర్రపుబండీలో అందరి ఇళ్ళకు వెళ్ళి ఇచ్చివచ్చేవారు.అంటే తప్ప
అంతకుమించి పరిచయంలేదు.వారుది పెద్ద మండువా ఇల్లు.లోఅపలికి
వెళ్ళగానే అక్క్డ ఉయ్యాలా బల్ల కనిపించింది.ఎక్కి కూచున్నాను,
ఇంతలో ఆమె వచ్చారు, ఆఖంగారులో ఉయ్యాలా ఆపకుండానే
దిగబోయి పడ్డాను .ఆవిడే లేవదీసి బుజ్జగించారు.కాస్త ధైర్యం
వచ్చింది.కృష్ణారావుగారు హాలులోవున్న మేడ మెట్ల మీదికి వచ్చి
తలఊపారు,అంటే వచ్చారా?అన్నట్లు.మా అమ్మ నేనూ నమస్కారం చేసాము.
"పైకి రండి."అన్నట్లుగా చేయి పైకి ఎత్తి వెళ్ళిపోయారు.ఆయనగది
మేడమీద వుండేది.రెడియొ కూడా అక్కడే వుండేది.రుక్మిణమ్మగారు
మమ్మల్ని పైకి తీసుకు వెళ్ళారు.ఆయన ఎదురుకుండా కూర్చోఅవాలంటే
అమ్మ నేనూ భయ పడిపోయాము.ముట్నూరివారు ప్రశ్నలు సమాధానాలు
చాలావరకు సౌజ్ఞలతోనే!"నాన్నగారి తాక్ విందామని అన్నాను.
ఏరీ! మీనాన్న ఇక్కడలేరుగా?అన్నారు.అందులోఅంచి వస్తుంది,అన్న.
ఇందులోఅంచా!ఏడీ ఆయన కనపడటంలేదే?అన్నారు.మద్రాస్ వెళ్ళారుగా!అన్నా.
భలేదానివే అక్కడమాట్లాడితే ఇక్కడ ఎలా వినిపిస్తుంది?అన్నారు.
వినిపిస్తుందని మానాన్న చెప్పారు,అన్నా.ఆయనేదో హాస్యానికి
అనివుంటారు,అన్నారు.ఇక నాకళ్ళల్లోఅ నెళ్ళు కింద జారడానికి
సిధ్ధం గా వున్నాయి.అప్పుడు ఆయన రేడియొ ఆన్ చేసారు,నాన్న
గారి పేరు చెప్పారు,సంతోఅషం పట్టలేక నేను లేచి నిలబడి
అదుగోఅ అదే మానాన్నగారిపేరు చెప్పారుగా!అన్నాను.సరె సరె
కూచునివిను అన్నారు.మానాన్నగారికి రెడియొ తాకెకి పది రూపాయలు
ఇచ్చారట.రానూ పోనూ ఖర్చులుకాక.మానాన్నగారు ఎనిమిది రూపాయలు
పెట్టి అమ్మకి జూకాలు,ఒకరూపాయతో ఇత్తడి లేడిబొమ్మ,ఒక రూపాయతో
నాకొక గౌను తెచ్చారు.ఆలేడి బొమ్మ ఇప్పటికి వుందినాదగ్గర.పొలిష్
చేస్తేబంగారలా మెరుస్తుంది.ఆరోజుల్లో రెడియొలు వేళ్ళమీద లెఖ్ఖ
చెప్పగలిగేటన్ని ఇళ్ళల్లో వుండేవి.రెడియొవుందంటే చాలాహోదా.
మా అమ్మ గారి తండ్రి శ్రీగిరిరాజు
రామచంద్రయ్య గారు నుజ్వీడులో మేకా రంగయ్యప్పారావుగారి
హైస్కూలులో ఇంగ్లీష్ మష్టారు.ఒకసారి ఒక మనిషి ఇంటికి వచ్చి
"మిమ్మల్ని రాజావారు రమ్మంటున్నారు."అనిచెప్పాడట.కారణం ఏమీ
తెలియదు.రాజా వారు కబురంపించారంటే ఏదో తప్పు జరిగి వుంటుందని
మాతాతగారు గబగ్బా బయలుదేరివెళ్ళారుట.రాజుగారికొతలోకి
అడుగుపెట్టెసరికి తాతయ్యగారికి గుండెలు దడలాడాయిట.ఏమివినాల్సి
వస్తుందేకోపం వచ్చి ఉద్యోగం నుచి తీసేస్తారేమో?అనుకొన్నారుట.
ఇంతలో ఎక్కడినుంచో మాటలు వినిపించాయి.మనుష్యులు కనిపించలా.
తాతగారు కుర్చీలోంచిలేచి గిరగిరా హాలంతా కలయ జూసినా
ఆమాటలు ఎక్కడినుంచి వచ్చాయో అర్ధం కాలేదు.ఇంతలో రాజా
వారు వచ్చారు.తాతయ్యగారు లేచి నమస్కరించి బేలగా
నుంచున్నారట.రజావారు నవ్వుతూ"రెడియో తెప్పించాము, విన్నారా?
మద్రాసు నుంచి ప్రోగ్రాములు వస్తాయి,ఇక్కడకూర్చుని వినవచ్చు."
మాతాత గారు కుదుటపడి,గుండెదడ ఆగి మాట్లాదేసరికి
అయిదునిముషాలు పట్టిందిట.ఆయన ఆశ్చత్యంగా నోరు పెడ్డగా తెరిచి"
"అలాగాండీ!అక్కడమాట్లాడితే ఇక్కడ వినిపిస్తుందా? అబ్బా? ఫెంటాస్టిక్.
అని కాసేపురెడియొ విని ఇంటికి వచ్చారట.ఆయన రెడియొతో తన తొలి
అనుభవాన్ని మాతో చెప్పారు.1950లో కాబోలు మెము రెడియొ కొనుక్కొన్నాము
రెడియొ దగ్గర పుస్తకం,పెన్సిల్ వుండేవి,వింటూ లలిత గీతాలు
వ్రాసుకొనేదాన్ని.

2 comments:

Sujata M said...

చాలా బావుంది. నాకు కూడా రేడియో ఇష్టం. మీ టపాలు చదువుతుంటే.. ఎప్పటెప్పటి విషయాలో జ్ఞాపకం వస్తాయి. మీరు చాల బాగా రాస్తారు. చాల నవ్వొచ్చింది. మీ చిన్నప్పటి మిమ్మల్ని చూసి ముద్దొచ్చింది! థాంక్స్.

మాలతి said...

రెడియొ ..,వింటూ లలిత గీతాలు వ్రాసుకొనేదాన్ని.

- నేను రాసుకోలేదు కానీ వాణి చూసి ఎప్పుడు మళ్లీ వస్తాయో చూసుకును మళ్లీ మళ్లీ వినేదాన్ని కంఠతా వచ్చేవరకూ. బాగుంది.