Pages

Saturday, May 24, 2008

ముట్నూరి కృష్ణారావు పంతులుగారు

బందరు ని మచిలీపట్నం అనికూడా అంటారు.ఇదిసముద్రానిక్
దగ్గర వుండడంతో ఓడరేవు అయింది.వెసవికాలం ఎండ బాధించేదికాదు.సాయంత్రం
నాలుగు ఘంటలయేసరికి సముద్రపుగాలులు చల్లగా వచ్చి సేదతీర్చేవి.మల్లెపూలు
ఘుమ్మని వాసన వేస్తూ రోడ్డుమీద పోయేవారిని రండి,కొనండి,ఇంటికి పట్టుకెళ్ళండి
ఇల్లాలు,పిల్లలు సంతోషిస్తారు,అని నిలేసేవి.సార్ధక జన్మనెత్తిన మల్లెపూలు వేసవి
కాలాన్ని ఏలేవి.దేవునికిభక్తిని,కన్నెపిల్లలకి గర్వాన్ని,యువకులకిమత్తుని,పిల్లలకి
చెప్పలేని ఆనందాన్ని పంచేవి.మల్లెపువ్వు,సన్నజాజి, విరజాజి ఎంతో సుకుమారమైన
పూలు నకగకుండా తలలో పెట్టుకొంటే నాలుగు మైళ్ళదాకా వాసనలు విరజిమ్మేవి.
కనీ పెడితే దోసెడుమొగ్గలు.ఒకొకసారి పక్క పల్లెటూళ్ళనుంచి మిట్ట మధ్యాన్నానికే
మల్లెపూల తట్టలు బందరు చేరేవి. అవివాడిపోతాయని వెడల్పాటి పళ్ళెంలో నీళ్ళుపౌసి
అందులే వేసేవారు.నలుగుగంటల్కె మల్లెలు విడిచేవి.ఆరోజుల్లో రెండు మూడుసార్లుపూల
జడలు పిల్లలకి వేసేవారు.ఒక్టి వంకీల జడ,రెండోది పెద్దజడ.వంకీలజడ అంటే
ఒకళ్ళు జుట్టుని మూడుపాయలు చెసి ఒకల్లు అల్లి,అపుడు ఒకొక్క పాయని కొన్ని పాయలుచేసి
వాటిమధ్య మల్లెమొగ్గని పెత్తి,మరో పువ్వు పెట్టి మరో పాయలో అలా ఒక్కొక్క పాయకి
పూలు వంకరగా అమ్ర్చేవారు.ఈజడ వేయడానికి తక్కువ పూలు పడ్తాయిగానీ,పక్కన
పూలు గబగ్బా అందించెవారు వుండాలి.లేకపోతే జడ బిగువు సడలి వదులయిపోతుంది
పూలూ రాలిపోతాయి.పెద్దజడ పొష్ట్ కార్డుల మీద ముందుగానే సూది దారంతో కుట్టెవారు.
ఈమల్లెలతో పాతు, మరువము,దవనము,కొండొకచో మాచిపత్రి,కనకాంబరాలు,రంగురంగులవూలు
చిన్న చిన్న కమలాలలా వున్న ప్లాస్టిక్ పూలువీతికి మధ్యలో గుండుసూది పెట్టి పూల
మధ్య అలంకరించెవారు.జడచివర జదకుప్పెలుగాని,పట్తుదారాలతో చేసిన జదకుచ్చులు
గాని పెట్టేవాఉ.జడవేసుకోగానే మహారాణీ పోజువచ్చేది.కొండరు ఆపూలజదని ఫొతో
తీయించెవారు.అవాళ పిల్లలు ఏపట్టు దుస్తులు వేసుకొంతానన్నా తల్లులు అభ్యంతరం
చెప్పేవారుకాదు.మాచిపత్రిని చూసి ఎన్ని ఏళ్ళయిందో!బందరుకు మరొక ఆకర్షణ మితాయిలు.
బందరు లడ్డుఈనాటికి పేరునిల బెట్టుకొంటూనెవుంది.బందరుహల్వా సంగతి చెప్పెక్కరలేదు.
ఆరోజుల్లో నెయ్యి అంటె రుచి,సువాసన.దానితో చేసిన మితాయిలు బందరు ఖ్యాతిని
దేశదేశాలకు చాటి చెప్పాయి. గుల్లపకోడీ,మెత్తనిపకోఅదీ,పునుకులు,వాటిరుచివాటిదే!
మెము అక్కద వున్నపుదు,మినర్వా టాకీసు,కృష్ణకిశోర్, బృందావనహాలు వుండేవి.
ఇళ్ళు అన్నీ ఒకే ఎత్తున వున్నట్లుగా వుండేవి.బందరుకి మధ్యగా రాబర్ట్సన్ పేట వుండేది,
సెంటరు అనేవారు.దాని చుట్టూ రాత్రిళ్ళు ఆవులు దాణా నెమరువేసుకొంటూస్థిమిత్సంగా పడుకొనేవి.
అక్కదే "మంజప్ప హోటలూ' వుండేది.పలహారాలు పసందుగాచేసి,కాఫీ పృఅత్యేకంగా చేసి బందరులోని
జనాలనందరిని అలరించేది. చాలామంది సాయంత్రాలప్పుదు అక్కదే గడిపేవారు.మల్లినాథ సూరిగారు
చేరే వారు.కనీ వకిట్లోనే నిలబడేవారు,"ఎంత సేపయిందండీవచ్చి!" అంటే " చాలాసేపయింది."
అనేవారట.'మరిలోపలకి వెళ్ళలేదేమి అంటే"చూస్తున్నా!ఎవరేనా వచ్చి లోపలికి ఆహ్వానిస్తారేమోనని."
అనేవారు."డబ్బులిచ్చి తనడానికి ఎవరో ఆహ్వానించాలా!ఇంకానయందండలువేయమన్నారుకాదూఅని నాన్నగారంటే "
"మీకు తెలియదండీ!ఎవరేనా వచ్చి " లోపలికి రండి"అంటే దాని అర్ధం" బిల్లునేచెల్లించు కొంటానని.
"అనేవారుట.అలాగె ఏ దశిక వారో వచ్చి "రండి,మాస్టారూ!''అంటేవెల్ళేవారట.వాళ్ళు ముందు కాఫీఇప్పించి,
ఏదైనా తినండి అనేవారుట.ఇడ్లీ తిన్నాక,దోసె తెప్పిస్తా అనేవారుత.అది అయాక "నీన్న
నే ఎం ఎల్ ఏ పెసరట్టుతిన్నాను చాలా బావుందండీ! అని అదీపెట్టించెవారుట."ఆతరవాత ఆయన
అమందానంద కందళిత హృదయారవిందుడై
బయటికివచ్చి ఆయనకి వీడ్కోలు చెప్పిపంపించి,మానాన్నగారితో అనెవారుట,"రావూరుగారూ!రోజూ
నేను పధ్నాలుగు అణాల ఆకలి చంపుకొంటున్నానన్నమాట!అనేవారుట.
బందరులో టౌన్ హాల్ వుండేది.కోటవారితుళ్ళు వుండేవి.
వంకర మేడ వుండేది.బృదావనసినిమాదగ్గరేదురుకుండాఒక పార్క్ వుండేది.అక్కద సాయంత్రాలు
స్పీకర్లు నాలుగు వేపులా పెట్టి రడిఒ పెట్టేవారు.ఇల్లల్లో రడిఒలు వుండేవికావు.గాంఢీగారు
పోయినప్పుడు ఆపార్క్ కువెళ్ళి గాంధీగారి అంతిమ యాత్రా విశేషాలు వాఖ్యానం వినిఏడుస్తూ ఇంటికి
వచ్చాము.ఆవారం కృష్ణాపత్రిక ముఖ పత్రంపై గాంధీగారు ఇద్దరు శిష్యురాళ్ళ బుజాలపై
చేతులువేసి వాళ్ళకి శాంతి,అహిన్స అనిపేర్లుపెట్టి విడుదల చేసారు.ఆబొమ్మ చూసి బనదరులోని
ఆబాల గోపాలం కళ్ళనీళ్ళు పెట్టుకోని వారులేరు.టౌన్ హాలులో సభలు, సమావేశాలు జరిపేవారు.
రంగ స్థల నటులు శ్రీ డి విసుబ్బారావుగారికి గజారోఅహణం చేసారు.బందరులో పెద్ద గ్రంధాలయం వుందేది.
తరువాత అది కాలిపోయిందో,కూలిపోయిందో అన్నారు.బుస్ ష్టాండు,రైల్వె స్టెషనువుండేవి.
వూరిలో తిరగడానికి రిక్షాలు.ఎద్దుబండ్లు,గుర్రపు బండ్లు వుండేవి.గుర్రపు బండీమీద
ఎక్కడికైనా వెడితె చాలా గర్వ ముగా వుండేది.మేము వుండే చెమ్మనగిరి పేటలో మాఇంటికి
ఒకవైపు శివాలయం,ఒకవేపు వేణుగోఅపాల స్వామి దేవాలయం వుండేవి.శివాలయం దీనంగా వుండేఅది.
వేణుగోఅపాల స్వామి ఆలయం వైభవంగా వుండేది.దేమునికి ఆభరణాలు వుండెవి.ధనుర్మాసం అట్టహాసంగా చేసేవారు.
ఆలయ ప్రాంగణంలో పొగడచెట్టు,గన్నేరులు,
మందారలు,తులసి తోఅట వుండేది.ప్రసాదాలు నేతితో మునిగి మహరుచిగా వుండేవి.
మాఇంటివెనక చల్ల బజారు వుండేది.చుట్టుపక్కల వూళ్ళనుంచి పెరుగు ముంతలు
తోడుపెట్టి తెచ్చి అమ్మేవారు.మాతాతగారు పెరుగు తీపి చెప్పేందుకు నన్ను వెట
తీసుకెళ్ళేవారు.ఆబజారులో రెండువైపులా చల్ల అమ్మేవాళ్ళు కూర్చుని "రండిబాబూ!
అనిపిలిచి నాచేతిలో కాస్త పెరుగు వేసేవారు.నేను మొఖం అదోలా పేత్తి "పుల్లగా
వుంది,తాతయ్యా అనేదాన్ని.అలా రుచి చూస్తూ చూస్తూ నాపొట్ట నిండాక ఒక ముంతేఅదో
బాగున్నదనేదాన్ని.జాడీతో పెరుగు తెచ్చి మా అమ్మతో తాతయ్య"మా ప్రబుధ్ధుడికి వెయ్యి
రసీ రాసీ గుండెలు వేడెక్కిపోతున్నాయి.''అనేవారు.మా అమ్మ సరే అనేది.మానాన్నగారు
పెరుగు దగ్గర కొచ్చేసరికి నక్షత్రాలలా నాలుగు మెతుకులు పె వేసుకొనేవరు.
తరవాత మా తాతయ్య వచ్చి జాడీచూసి"మీరిద్దరూ తిందామని వాడికి వెయ్యకుండా
వూరుకొన్నారా!అనేవారు.

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

బావుందండీ - ఒకసారిగా మళ్ళీ బందరు అలా కళ్ళ ముందు నిలబడిపోయింది....నేను ఎప్పటినుంచో ఫోటోలతో సహా ఒక టపా రాద్దాము అని అనుకుంటూ ఉండటం, అది వాయిదా పడటం జరుగుతూ వస్తోంది...త్వరలోనే విపులంగా రాస్తా...ధన్యవాదాలు మరొక్కసారి మీ, మా, మన - బందరును గుర్తుచేసినందుకు

ఏకాంతపు దిలీప్ said...

@జ్ఙాన ప్రసూన గారు
మీ బ్లాగు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది... మీ వయసు వారు ఇంత ఉత్సాహంగా పది మందితో మీ అనుభవాలని పంచుకోవాలనుకోవడం నిజంగా సంతోషం కలిగించే విషయం... మీ టపాలని చాలా వరకు చదివేసాను... ఇలా అనుభవాలాని, జీవిత సారాన్ని పంచుకునే వాళ్ళు పెరిగితే తరానికి తరానికి అంతరాలు తగ్గుతాయని, బంధాలు పటిష్టమవుతాయని, వారసత్వంగా నిలుపుకోగలిగినవి కాల ప్రవాహానికి తట్టుకుని నిలబడతాయని విశ్వసిస్తున్నాను... మీరు ఆరోగ్యంగా,ఉత్సాహంగా మరిన్ని టపాలు అందించాలని కోరుకుంటున్నాను...