తెలియని తెలుగు
మాదితెలుగుగడ్డ.మేము తెలుగువారము అనుకొంటాముకానీ
మనం పుట్టి పెరిగిన జిల్లా నుంచి పక్క జిల్లాకి వెడితే భాష మారిపోతుంది.
వాళ్ళు విప్పి చెపుతేకానీ కొన్ని మాటలు అర్ధంకావు.ఆమధ్య మాఇంటికి విశాఖ
పట్నం అటువేపునుంచి బంధువు ఒకావిడ వచ్చింది.నాలుగురోజులుండి వెడుతూ
మా చిన్న వాడి చేతులో పది రూపాయలు పెట్టి,బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకొని
"సబ్బు బిళ్ళకొనుక్కో నానా!"అని మెట్లు దిగి రిక్షా ఎక్కి వెళ్ళీపోయింది.వాడికి
నాకూ ఏమీ అర్ధం కాలా!సబ్బు బిళ్ళ కొనుక్కోమంటుందేమిటి?అనుకొన్నాము.వాకబు
చెస్తే తెలిసిందిఏమిటంటే"సబ్బు బిళ్ళాన్Yఏ పిప్పరమెంట్,నిమ్మతొనలుట.
పక్కింట్లోకి కొత్తగా ఎవరో కాపురానికివచ్చారు.పొద్దుటినుంచీ
సామాను సర్దుతున్నారు.ఒంటిఘంటకి మాఇంటికి వచ్చి పరిచయం చేసుకుని,మా అమ్మాయి
శశిరేఖని "రెండు మంచిళ్ళియ్యమ్మా!"అంది.మా అమ్మాయి లోపలికెళ్ళి రెందు గ్లాసులతో
మంచి నీళ్ళు తెచ్చింది.ఆవిదనవ్వి"రెండు అంటే రెండుగ్లాసులు కాదమ్మా!ఒకటిచాలు.
మావేపు మంచినీళ్ళు ఇలాగే అడుగుతాము,అంది. అప్పటినుంచీ మాఇంట్లోఅందరూ
"రెండుకాఫీఇయ్యి,రెండూన్నం పెట్టు" అని మొదలెట్టారు.
మాది కృష్ణాజిల్లా,మా అత్త వారిది గోదావరిజిల్లా.పెళ్ళయిన కొత్తలో
నే పడ్డ పాట్లు ఇన్ని అన్ని కావు. మావారి అమ్మమ్మ గారికి చచ్చే మడీ
ఆచారం.ఆవిడికి బారెడు దూరంలో నుంచున్నా చాలు"అసింటా జరుగమ్మా!అనేవారు.
నన్నే అంటున్నారని తెలిసేది కానీ "అసింటా" అంటే ఏమీ తెలిసేదికాదు.మాచిన్న
ఆడబడుచు సమయానికి వచ్చి దేముడిలా నన్ను కాపాడుతూవుండేది.తను వచ్చి
అమ్మమ్మ గారి వెనకనించిచేట్టో అవతలకి వెళ్ళు, అన్నట్లు సౌజ్ఞ చేసింది.అసింటా
అంతే అవతలికి,ఇసింటా అంటె ఇవతలకి అన్నమాట.
సాయంత్రంపూట చీరమీద ఎంబ్రాయిడరీ కుట్టుకొంటున్నా.ఆవిడ
వచ్చి"అస్తానపేళ ఏమిటాకుట్లు అన్నారు.చీరలోపల పెట్టేసా,మళ్ళీ బయటికి తీయ్లా.
ఒకరోజు"ఏమే చీర కుట్టుకోఅడంలేదే!అన్నారు.వద్దన్నారుగా!అన్నాను,పగలుకుట్టుకొంటే
వద్దన్నానా!సూర్యాస్తమయమయే అస్తాంపువేల కుట్టుకోకూడదన్నను,అంతే అన్నారు.అప్పుదు
అర్ధమయింది,అస్తానపువేళ అంటేసంధ్యవేళ అని.
రాయలసీమ వాళ్ళ భాష కొత్తగానే వుంటుంది.మా
స్నేహితురాలి కూతుర్ని అటువేపే ఇచ్చారు. ఆ అమ్మాయి బలార్షాలో చదువుకొంది.
వాళ్ళది సమిష్టి కుతుంబముట.అత్తగారు వంట చేస్తూ"గోడంబీ"ఇలాతేమ్మా!అన్నరుట.
దానికితెలియలా.డబ్బాలన్నీ మూతలు తీస్తోంది,పెడుతోంది.ఏమితీసుకు వెళ్ళాలో
తెలియలేదు.మళ్ళీ అత్తగారు"పాయసంలో వేయడానికి కిస్మిస్
తెచ్చుకొన్నా గోడంబీ మర్చిపోయా.అన్నరట.సందర్భాన్ని పట్టి కిస్మిస్ తో జీడి పప్పు
పాయసంలూ వేస్తారుకదా!అని గ్రహించి తీసుకు వేల్లిందిట. .వాళ్ళమ్మ ఫొనుచేసి"ఏమే!
కాపురం ఎలావుంది?అని అడిగితే "అంతా బాగానే వుందికానీ,అమ్మా వీళ్ళ భాష
అర్ధంకాక చస్తున్నానే!తెలుగుభాషలో ప్రాంతానికి,ప్రాంతానికి ఇంత తేడాలుంటాయని
తెలుస్తే ఈ రాయలసీమ వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ట్యూషను చెప్పించుకొని మరీ పెళ్ళి
చెసుకొనేదాన్ని.అన్దిట.
భాష తెలియకపోతె ఎంత హాస్యం పుడుతుందో చూడండి.
ఒకసారి ఫ్రెండ్స్ ఇంటికివెళ్ళాము.కబుర్లు చెపుతూంటె పొద్దుపోయింది.ఒకె ఆఫీసులొ
పనిచెసే వాళ్ళు తీరుబడిగా కలిస్తెపక్క వాళ్ళని మర్చిపోయి మాట్లాడుకొంటారు.
ఆయన ఆవిడ్తో"పొద్దుపోతావుంది,ఇక లట్టీంచరాదూ!అన్నాడు.ముందునుంచి లట్టిస్తె ఆళ్ళ
కెట్లుంటదో!అప్పటికి లట్టీంచుదామని చూస్తున్నా!అన్నది.మేమిద్దరం అర్ధంకాక
పనికిరాని నవ్వొకటి నవ్వాము.వీళ్ళు మనల్ని ఏమిచేస్తారురాబాబూ!అనిలొలోఅపల
పీచుపీచుమంటూంది."నీకు రెండు లట్టించనా!అందివాళ్ళాయనతో.ముందాయనకి
వడ్డించి తరవాత మా భరతం పడుతుంది కాబోలు అనుకొన్నా,అసలు సంగతేమిటంటే
లట్టించడం అంతే రొట్టెలు వత్తడముట.
కొత్తలో అత్తగారు"గోలెములో కాసిని నీళ్ళు పట్రామ్మా!"అన్నారు.
వెనకవేపు అంతాచూసా,కానీ గోలెం అంటె తెలియలా. మమూలుగా వదినావచ్చి"ఏమిటలానుంచున్నావు?
."అదె గోలెం అన్నా.అదా అదిగో నీఎదురుగానేవుందిగా?అనిచూపించింది.
చెక్కమూత పెట్టి నీళ్ళతొట్టె కనిపించింది.హమ్మయ్య గోలెం అంటె నీళ్ళతొట్టి అని
బుర్రలో వ్రాసుకొన్నా.
తిరుపన్యారాలు చెస్తరా!అందినీరజ.తిరుపన్యారమా!తిరుప్పావు
అంటె తెలుసు కేఆనీ తిరుపన్యారం ఏమిటి? తిరుపతి యాత్రకి మరోపేరా ?ఏదైనా వ్రతమా
శెనగపిండి,బెల్లం,మైదాతో చేస్తారుగా! !అంది.బొబ్బట్లా!అన్నను.మరె!అంది.తిరుపంయారము
అంతె బొబ్బట్లు.
మెము బందరులో వుండెటప్పుడు రజాకార్ మూమెంట్ వచ్చింది.
తెలంగాణా నుంచిజనం పుట్టలు పుట్టలుగావచ్చి బోలెడుకిరాయిలిచ్చి ఇళ్ళల్లో
చెరిపోయారు.ఒక్కసారి ధరలన్నీ పెరిగిపోయాయి .మాఇంట్లోనూచెరారు.వాళ్ళ భాష
బలేగా వుండేది.నెను తీరికగా వాళ్ళదగ్గ్ర కూర్చునివిని అదె భాషలో
మాట్లాదెదాన్నిపోరి,పోరడు,బాసన్లు,పొద్దుమీదికి,నల్ల,దిమాగ్,ఖరాబ్,లొల్లి,జర్ర,
పరెషాన్,ఖ్త్మ్,బాంచను,గాడ గీడసాంపు,గిన్ని,గన్ని.అనేవాళ్ళు.మెము కోపం వస్తె
సన్నసీ,పిచ్చి మొద్దు.దద్దమ్మ అనెవాళ్ళం ఆమాటె ఎవరన్నా అంటె మూడురోజులు ఏడ్చెవాళ్ళం.
కొన్ని జిల్లవారు తిట్లలోపండితులు.కొన్నిమచ్చుకి,నీమొహం బోర్లావేసిఈడుస్తా,
వెధవ పీనుగా,నీమొహంతగలెయ్యా,శవాకారంవెధవ,ఇదెక్కదివెధవగోల?,ఇదెక్కడి
తద్దినం,చావు, వెధవ పీనుగా ఇలాసరసంగాతిట్టుకొంటారు.
4 comments:
అమ్మా
భలే ఉన్నది మీ "భాషా" వ్యాసం..చచ్చాను నవ్వలేక ..
చాలా బావుందండీ.
మనలో మాట, వెధవ పీనుగ అనేది .. జిల్లాల తేడా ఏమోగానీ .. నాకు తెలిసి శుద్ధ బ్రాహ్మణ తిట్టు.
@ప్రసూన గారు
మీ జ్ఞాపకాల దొంతరల్లోంచి ఇలానే పేజీలు నింపుతూ పోండి...
అన్నట్టు రజాకార్ మూమెంట్ అన్నారుగా... దానికి సంబంధించి, కోస్తా ప్రజలు తెలంగాణా వారికి ఎలా బాసటగా నిలిచారో మీకు గుర్తున్నంత వరకు మాతో పంచుకోగలరా? మీలాంటి వాళ్ళ ద్వారానే నేను నిజాలు తెలుసుకోగలను... దయచేసి ఒక టపా రాయండి...
పెనం మీద జొన్న గింజలు వేయించినట్టు చిట పట మంటూ భలే పేలాయండి. మీలాంటోళ్ళు ఎక్కడుంటే అక్కడంతా నవ్వుల సందడే ఇలాంటి విషయాలు ఏకరువు పెడుతుంటే.
-- విహారి
Post a Comment